Patiala Necklace: యూట్యూబర్ మెడలో ఇండియన్ కింగ్ డైమండ్ నెక్లెస్‌.. రాజుకున్న వివాదం

Patiala Necklace: యూట్యూబర్ మెడలో ఇండియన్ కింగ్ డైమండ్ నెక్లెస్‌.. రాజుకున్న వివాదం
Emma Chamberlain Wears Indi

ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్‌లో అరంగేట్రం చేసింది 20 ఏళ్ల ఎమ్మా. ఈ ఈవెంట్ లో ఎమ్మా చాంబర్ ధరించిన చోకర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అది మహారాజా ఆఫ్ పాటియాలా డైమండ్ చోకర్‌. ఆ నెక్లెస్ ఒక‌ప్పటి భార‌తీయ రాజుది కావ‌డంతో ఎమ్మాపై భార‌తీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Surya Kala

|

May 11, 2022 | 7:08 PM

Emma Chamberlain at Met Gala 2022: భార‌త దేశానికి వ్యాపారం కోసం వచ్చి.. పాలకులుగా మారి… మన దేశ సంపదను..  లూటీ చేసిన  బ్రిటిష్(Bitish) వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. కోహినూర్ వజ్రం దగ్గర నుంచి కొన్ని కోట్ల విలువైన సంపదను, అప్పటి రాజుల నగలు, ఆభరణాలను దోచుకుని తమ దేశానికి తీసుకుని వెళ్లిపోయారు.. ఇలా దొంగతనంగా తీసుకుని వెళ్లిన భారత దేశ వారసత్వ సంపదని..ఇప్పటికీ బ్రిటిష్ వారు తమ సొంతదానిలా భావిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన మెటా గాలా (Met Gala 2022) దీనికి స‌జీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రముఖ అమెరికన్ యూట్యూబర్..  సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎమ్మా చాంబర్‌లైన్ మెట్‌గాలాలో  లూయిస్ విట్టన్ దుస్తులు ధరించి అరంగేట్రం చేసింది. అంతేకాదు.. ఆమె ధరించిన నగలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్‌లో అరంగేట్రం చేసింది 20 ఏళ్ల ఎమ్మా. ఈ ఈవెంట్ లో    మహారాజా కార్టియర్ (Cartier jewels) జ్యూయలర్స్‌కి అంబాసిడర్‌‌గా వ్యవహరిస్తున్న ఎమ్మా చాంబర్..ఆమె డైమండ్ హెడ్‌బ్యాండ్, చెవిపోగులు, చోకర్ ధ‌రించింది. ఆమె మొత్తం లుక్‌లో చోకర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అది మహారాజా ఆఫ్ పాటియాలా డైమండ్ చోకర్‌. ఎమ్మా ధ‌రించిన ఆ నెక్లెస్ ఒక‌ప్పటి భార‌తీయ రాజుది కావ‌డంతో ఎమ్మాపై భార‌తీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెక్లెస్ వాస్తవానికి పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన భూపిందర్ సింగ్‌కు చెందినది. మహారాజుకు చెందిన ఈ  పాటియాలా డైమండ్ చోకర్‌‌ని 1928 పాటియాలా నెక్లెస్ అని కూడా పిలుస్తారు. దీనిని 2,930 వజ్రాలు, 234.65 క్యారెట్ డి బీర్స్ డైమండ్‌, బర్మీస్ కెంపులతో తయారు చేశారు. ఈ ఆభరణం తయారీకోసం మహారాజా 1888లో దక్షిణాఫ్రికాలో లభించిన అతి పెద్ద వజ్రాన్ని.. 1889లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 1928లో మహారాజా కోరికపై కార్టియర్ సంస్థే దీన్ని తయారు చేసింది. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగల్లో ఒకటిగా తెలుస్తోంది. అయితే రాజావారి కుమారుడు మహారాజా యదవీంద్ర సింగ్ చివరిసారిగా 1948లో దీన్ని ధరించినట్లు తెలుస్తోంది. అనంతరం.. 1948లో ప‌టియాలా రాయల్ ట్రెజరీ నుండి ఈ అద్భుతమైన నెక్లెస్‌ కనిపించకుండా పోయింది. అయితే ఈ నెక్లెస్‌ని భారతదేశంలోని బ్రిటిష్ దళాలు దొంగిలించాయని, కార్టియర్‌కు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ చోకర్ భారతదేశ చరిత్రకు సంబంధించిందని సెలబ్రిటీలకు ధరించేందుకు ఇవ్వడానికి ఇది ఫ్యాన్సీ ఆభరణం కాదని బ్రౌన్ బాడీస్ NFTకలెక్షన్ ట్విట్టర్‌ లో పేర్కొంది. అంతేకాదు..ఈ చర్య అగౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది.

ఇక భారత దేశ చారిత్రక విష‌యాల‌ను తెలియ‌జేసే ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అదే నెక్లెస్‌ ధరించి ఉన్న రాజు ఫోటోల‌ను గ‌తేడాది ఇన్‌స్టాలో పోస్టు చేసినప్పుడు.. ఈ నెక్లెస్ స్పష్టంగా కనిపించింది. ఈ ఆభరణం తయారు అయిన తర్వాత ఇరవై ఏళ్లకు అదృశ్యమైంద‌ని తెలుస్తోంది. అనంతరం లండన్‌లోని ఓ పురాతన వస్తువుల దుకాణంలో నెక్లెస్‌లో కొంత భాగం కనిపించింది. కాలక్రమేణా..  ముఖ్యమైన రాళ్ళు తొలగించి, విక్రయించార‌ని వార్త ప్రచారంలో ఉంది. చివరికి, “డి బీర్స్” మళ్లీ కనిపించగా, 1982లో మూడు మిలియన్ డాలర్లకు పైగా దీన్ని విక్రయించిన‌ట్లు తెలుస్తుంది.

భారతదేశంలోని వలసపాలకుల తీరుకి సజీవ సాక్ష్యం అంటున్నారు. అప్పట్లో వివిధ రాజ కుటుంబాలకు చెందిన అనేక విలువైన వారసత్వ ఆభరణాలు బ్రిటిష్ వారు దొంగిలించి తమ దేశానికి తరలించారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కోహినూర్‌తో సహా అనేక విలువైన ఆభరణాలను యజమానికి తిరిగి ఇవ్వలేదంటూ.. దొంగ సొమ్ముని సొంత సొత్తులా వాడుకుంటున్నారు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరి కొందరు నెటిజన్లు భారతీయ సంస్కృతి , వారసత్వంపై ఇప్పటికైనా అవగాహన అవసరమని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు, ఎమ్మా ఛాంబర్లిన్ తన లుక్ సోషల్ మీడియాలో విమర్శలకు గురైనప్పటికీ.. ఇప్పటికీ ఈ వివాదంపై స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్  వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu