Sarkaru Vaari Paata: పాన్ ఇండియా మూవీ పై క్లారిటీ ఇచ్చిన మహేష్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా మరి కొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Sarkaru Vaari Paata: పాన్ ఇండియా మూవీ పై క్లారిటీ ఇచ్చిన మహేష్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: May 11, 2022 | 3:08 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu)సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా మరి కొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై కావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టిగా చెప్తున్నారు చిత్రయూనిట్. ఇక ప్రమోషన్స్ లో కూడా దూకుడు చూపిస్తున్నారు సర్కారు వారి పాట టీమ్. మహేష్ బాబు కూడా వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అక్కరు వారి పాట సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని అన్నారు మహేష్. అలాగే ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్త గా ఉంటుంది.. ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అదే విధంగా ఈ సినిమా ఉండనుందని మహేష్ తెలిపారు. అలాగే పాన్ ఇండియా మూవీ  గురించి కూడా క్లారిటీ ఇచ్చారు మహేష్.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మీరు నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా చేస్తారా అని ప్రశ్నించగా.. నేను, రాజమౌళి గారు చేస్తే పాన్ ఇండియా కాకుండా ఎలా వుంటుంది అంటూ సమాధానం ఇచ్చారు మహేష్. అలాగే సినిమా అభిమానులతో పాటు అందరికీ నచ్చాలి. అందరికీ నచ్చే సినిమా చేయాలనే వుంటుంది. ఇంత భారీ బడ్జెట్‌తో పూర్తిగా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేయలేం. అందరూ మెచ్చే సినిమా చేసే దిశగానే కష్టపడుతుంటా.. అన్నారు మహేష్. దాంతో తన నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా మూవీ ని క్లారిటీ వచ్చేసింది. అలాగే సర్కారు వారి పాట సినిమా గురించి మాట్లాడుతూ.. గత మూడు సినిమాల్లో మెసేజ్ బాగా రుద్దారు. మహేష్ బాబుని ఇలా బౌండరీలు లేకుండా చూడటం బావుంది”అని సర్కారు వారి పాట ట్రైలర్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. సినిమా కూడా చాలా రిఫ్రెషింగ్ గా వుంటుంది అన్నారు మహేష్. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా సర్కారు వారి పాట ఉండనుందని తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కోవిడ్ పాజిటివ్.. మానసికంగా ధైర్యంగా ఉన్నానంటూ పోస్ట్..

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ పై సింహాంలా గర్జించిన మహేష్..

Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..