Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ పై సింహాంలా గర్జించిన మహేష్..

విడుదలకు ముందే సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే దాదాపు హైదరాబాద్‏లో అన్ని షోలు బుక్ అయిపోయాయి.

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ పై సింహాంలా గర్జించిన మహేష్..
Sarkaru Vaari Paata
Follow us
Rajitha Chanti

|

Updated on: May 11, 2022 | 1:53 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‏తో సినిమా ఏ రెంజ్ ఉండబోతుందో హింట్ చెప్పేశారు మేకర్స్. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఓ వైపు యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. కళావతి, పెన్నీ, మ.. మ.. మహేశ్ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే విడుదలకు ముందే సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే దాదాపు హైదరాబాద్‏లో అన్ని షోలు బుక్ అయిపోయాయి. నైజాం.. తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యుడు.. సినీ విశ్లేషకుడు ఉమర్ సంధు సర్కారు వారి పాట రివ్యూను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. ” మహేష్ బాబు ఈ సినిమాలో క్రూర సింహంలా కనిపించాడు.. అతని నటన.. కోపాన్ని ప్రదర్శించిన తీరు ప్రతిసారి స్క్రీన్ బర్న్ చేశాడు.. సర్కారు వారి పాట చిత్రానికి మహేష్ శక్తిని అందించాడు. ” అంటూ చెప్పుకొచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించన ఈ మూవీలో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించగా.. తమన్ మ్యూజిక్ అందించారు. ఇందులో మహేష్ మరింత హ్యండ్సమ్.. స్టైలీష్ లుక్కులో కనిపించనున్నాడు..

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..

Allari Naresh: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటున్న అల్లరి నరేష్.. ఆకట్టుకుంటున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

Sarkaru Vaari Paata: త్రివిక్రమ్‏తో చేయబోయే సినిమా జోనర్ అలాంటిదే.. మహేష్ బాబు కామెంట్స్..