AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ఇదేం పిచ్చి రా బాబు.. సలార్ డైరెక్టర్‏కు సూసైడ్ లెటర్.. నెట్టింట్లో వైరల్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి.

Salaar: ఇదేం పిచ్చి రా బాబు.. సలార్ డైరెక్టర్‏కు సూసైడ్ లెటర్.. నెట్టింట్లో వైరల్..
Prashanth Neel
Rajitha Chanti
|

Updated on: May 11, 2022 | 8:31 AM

Share

సాధారణంగా హీరోలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఏం చేయడానికైనా సిద్ధమైపోతుంటారు. ఇక ఆ స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయితే అభిమానులు చేసే హడావిడి గురించి తెలిసిందే. భారీ కటౌట్స్.. బాణసంచాలతో థియేటర్ల రచ్చ చేస్తుంటారు. ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేసే డైరెక్టర్స్ ఫ్యాన్స్ గురించి దృష్టిలో పెట్టుకుని కొన్ని సన్నివేశాలను డిజైన్ చేస్తుంటారు.  (Prabhas)ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి.. ట్రైలర్.. సాంగ్స్.. సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రతి అప్డేట్ సంచలనంగా మార్చేస్తుంటారు. ఎప్పుడెప్పుడు మూవీ కంప్లీట్ చేస్తారా ? అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యామా అని.. ఇప్పుడు తమ హీరోల సినిమా గురించి ఎప్పటికప్పుడు నేరుగా దర్శకులనే అడిగేస్తున్నారు. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు తమదైన శైలీలో సమాధానాలు ఇస్తుంటారు డైరెక్టర్స్.. తాజాగా ప్రభాస్ అభిమాని ఒకరు.. తమ హీరో సినిమా అప్డేట్ కోసం ఏకండా డైరెక్టర్‏కే సూసైడ్ లెటర్ రాశాడు.. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఇంటెన్సిటీని పెంచేసింది. అయితే ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. గత కొద్ది రోజులుగా మే నెలలో సలార్ గ్లింప్స్ రాబోతుందండూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో సలార్ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అప్డేట్ గురించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీంతో ప్రభాస్ వీరాభిమాని ఒకరు ఏకంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కే సూసైడ్ లేఖ రాశాడు. మే నెలలో సలార్ గ్లింప్స్ విడుదల చేయకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ లేఖలో పేర్కోన్నారు. ఇప్పుడు ఈ లెటర్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Prabhas

Prabhas

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..

Allari Naresh: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటున్న అల్లరి నరేష్.. ఆకట్టుకుంటున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

Sarkaru Vaari Paata: త్రివిక్రమ్‏తో చేయబోయే సినిమా జోనర్ అలాంటిదే.. మహేష్ బాబు కామెంట్స్..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే