AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కోవిడ్ పాజిటివ్.. మానసికంగా ధైర్యంగా ఉన్నానంటూ పోస్ట్..

చెన్నైలో ఉన్న తాతయ్య వాళ్ల దగ్గరకు వెళ్లేందుకు కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్‏గా నిర్ధారణ అయ్యిందని...

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కోవిడ్ పాజిటివ్.. మానసికంగా ధైర్యంగా ఉన్నానంటూ పోస్ట్..
Upasana Konidela
Rajitha Chanti
|

Updated on: May 11, 2022 | 1:58 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela) కరోనా బారిన పడ్డారు.. చెన్నైలో ఉన్న తాతయ్య వాళ్ల దగ్గరకు వెళ్లేందుకు కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్‏గా నిర్ధారణ అయ్యిందని… క్వారంటైన్‏లో ఉండి చికిత్స తీసుకుని ప్రస్తుతం ఉపాసన కోలుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉపాసన తన ఇన్ స్టా ఖాతా ద్వారా తెలియజేసింది. ” గతవారం నాకు కోవిడ్ వచ్చింది.. ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకోవడం వలన స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. డాక్టర్స్ కేవలం పారాసెటమాల్, విటమిన్స్ తీసుకోవాలని సూచించారు.. బలహీనపడడం.. జుట్టు వదులుగా మారడం..నొప్పులు ఉంటాయని భయపడ్డాను..

కానీ ఇలాంటివేమి జరగలేదు.. నేను శారీరకంగా.. మానసికంగా దృఢంగా ఉన్నాను.. కోవిడ్ మళ్లీ విజృంభిస్తుందో లేదో తెలియదు. కానీ జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ముఖ్యం.. చెన్నైలో ఉన్న తాతయ్య వాళ్లను కలిసేందుకు వెళ్లడానికి టెస్ట్ చేయించుకోవడం వలన తెలిసింది.. లేదంటే తెలిసేదే కాదు.. కోలుకోవడానికి సహయం చేసిన వైద్యులకు కృతజ్ఞతలు ” అంటూ చెప్పుకొచ్చారు ఉపాసన.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..

Allari Naresh: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటున్న అల్లరి నరేష్.. ఆకట్టుకుంటున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

Sarkaru Vaari Paata: త్రివిక్రమ్‏తో చేయబోయే సినిమా జోనర్ అలాంటిదే.. మహేష్ బాబు కామెంట్స్..

Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..