Prithviraj Chauhan: అక్షయ్ కుమార్ హీరోగా పృథ్వీరాజ్ చౌహాన్ చిత్రం.. పృథ్వీరాజ్, సంయోగిత ప్రేమకథ ఏమిటో తెలుసా..

Prithviraj Chauhan: అక్షయ్ కుమార్ హీరోగా పృథ్వీరాజ్ చౌహాన్ చిత్రం.. పృథ్వీరాజ్, సంయోగిత ప్రేమకథ ఏమిటో తెలుసా..
Prithviraj Chauhan Love Sto

పృథ్వీరాజ్ చౌహాన్ ధర్మం మూర్తీభవించిన ఓ వీరుడు.. అతని లవ్ స్టోరీలో థ్రిల్, ఎమోషన్, ఫుల్ డ్రామా కూడా ఉన్నాయి. ఎందుకంటే, పృథ్వీరాజ్ చౌహాన్ తనకు ఇష్టమైన యువరాణిని పొందడానికి ఆమెను స్వయంవరం సమయంలో అనేక మంది వరుల మధ్య నుండి తీసుకువచ్చాడు.

Surya Kala

|

May 11, 2022 | 4:35 PM

Prithviraj Chauhan Love Story: బాలీవుడ్(Bollywood) నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) కొత్త చిత్రం త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా పేరు పృథ్వీరాజ్ చౌహాన్. రాజపుత్ర వంశస్థుడైన పృథ్వీరాజ్ చౌహాన్ గురించి తెలుసుకోవడానికి చరిత్రలో డజనుకు పైగా  పుస్తకాలు ఉన్నప్పటికీ.. అత్యంత ప్రముఖమైన పుస్తకం పృథ్వీరాజ్  మిత్రుడు మంత్రి అయిన చాంద్ బర్దాయ్ రాసి ప్రచురించిన పృధ్వీరాజ్ రాసో అనే పుస్తకం ముఖ్యమైంది. పృథ్వీరాజ్ రాసో ఒక ఇతిహాసానికి చెందిన కథ.. ఇందులో భారతదేశం శక్తివంతమైన హిందూ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ గురించి చెప్పారు. ఇప్పుడు ఈ క‌థ‌పై సినిమా రూపొందుతోంది. అయితే ఈ క‌థ ఏంటో తెలుసుకోవాల‌నుకుంటున్నారా?  పృథ్వీరాజ్ గురించి ఇంత ప్రస్తావన ఎందుకంటే.. పృథ్వీరాజ్ చౌహాన్ ధర్మం మూర్తీభవించిన ఓ వీరుడు.. అతని లవ్ స్టోరీలో థ్రిల్, ఎమోషన్, ఫుల్ డ్రామా కూడా ఉన్నాయి. ఎందుకంటే, పృథ్వీరాజ్ చౌహాన్ తనకు ఇష్టమైన యువరాణిని పొందడానికి ఆమెను స్వయంవరం సమయంలో అనేక మంది వరుల మధ్య నుండి తీసుకువచ్చాడు.

పృథ్వీరాజ్ చౌహాన్- సంయోగిత ప్రేమకథ సంయోగిత కన్నౌజ్ రాజు జైచంద్ కుమార్తె. అందాల సౌందర్యరాశి. ఒకసారి సంయోగిత పృథ్వీరాజ్ చౌహాన్ చిత్రాన్ని తన రాజభవనానికి వచ్చిన ఒక చిత్రకారుడి వద్ద చూసింది. పృథ్వీరాజ్ చిత్రం.. రూపం సంయోగిత మనసు దోచేసింది. తన ప్రేమను దూతల ద్వారా చౌహాన్‌కు తెలియజేసింది. అలా వారి ప్రేమ ప్రయాణం మొదలై రహస్యంగా కొనసాగుతోంది. వీరిద్దరి ప్రేమ సంయుక్త తండ్రి రాజా జైచంద్‌కు తెలిసింది. అయితే  సంయోగిత తండ్రి జైచంద్‌, పృథ్వీరాజ్‌లు ఒకరినొకరు ఇష్టపడలేదు. ఈ కారణంగా, పృథ్వీరాజ్ ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న సమయంలో, జైచంద్ రాజసూయ యాగం, అతని కుమార్తె స్వయంవరాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. జైచంద్ ఈ యాగానికి సంబంధించిన ఆహ్వానాన్ని చుట్టుపక్కల ఉన్న రాజులందరికీ పంపాడు. దాంతో వెంటనే స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఈ స్వయంవరానికి చౌహాన్‌ తప్ప రాజులందరినీ ఆహ్వానించాడు. సేవకుడి రూపంలో చౌహాన్‌ బొమ్మను గుమ్మం దగ్గర పెట్టి కసి తీర్చుకున్నాడు.

సంయోగితకి తండ్రి మీద కోపం వచ్చింది. స్వయంవరంలో వచ్చిన రాజులలో ఎవరినైనా ఎన్నుకోమని సంయోగితను కోరాడు. అయితే సంయోగిత ఇతర రాజులను వరుడుగా ఎంచుకోవానికి సిద్ధంగా లేదు.  పృథ్వీరాజ్ చౌహాన్ రాలేదని తెలియగానే సంయోగిత తలుపు వద్ద ఉంచిన పృథ్వీరాజ్ చౌహాన్ విగ్రహానికి పూలమాల వేసి బయటకు వెళ్లింది. ఇంతలో పృథ్వీరాజ్ చౌహాన్ అక్కడికి చేరుకుని సంయోగిత ను తీసుకుని ఢిల్లీ చేరుకున్నారు.  భారత్‌పై ముస్లింల దండయాత్రకు ఈ ప్రేమకథే కారణమని అంటున్నారు. ఎందుకంటే సంయోగిత తండ్రి జైచంద్ ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం పాలకుడు మహ్మద్ ఘోరీని పృథ్వీరాజ్ చౌహాన్‌పై దాడి చేసేందుకు ఆహ్వానించాడు. అలా తన ప్రతీకారం తీర్చుకోవాలని  జై చంద్ భావించాడు.

పృథ్వీరాజ్ చౌహాన్ గురించి పృథ్వీరాజ్ చౌహాన్ 1166లో అజ్మీర్ రాజవంశంలో జన్మించాడు. అతని తండ్రి పేరు రాజా సోమేశ్వర్ చౌహాన్, అజ్మీర్ రాజు. తండ్రి రాజా సోమేశ్వర్ చౌహాన్ మరణానంతరం, పృథ్వీరాజ్ 13 సంవత్సరాల వయస్సులో రాజు అయ్యాడు. పృథ్వీరాజ్ చౌహాన్ చౌహాన్ రాజవంశానికి చెందిన గొప్ప రాజు. అతను నేటి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించాడు. పృథ్వీరాజ్ చిన్నప్పటి నుండి తెలివైనవాడు. యుద్ధ తంత్రం తెలిసిన వీరుడు.  ‘పృథ్వీరాజ్ విజయ్’ పుస్తకంలో అతనికి ఆరు భాషలు తెలుసు అని .. 14 భాషలలో పరిజ్ఞానం కలిగి ఉన్నాడని తెలుస్తోంది.  ‘పృథ్వీరాజ్ రాసో’లో చరిత్ర, గణితం, పెయింటింగ్ , వైద్యశాస్త్రంలో లోతైన జ్ఞానం ఉందని పేర్కొన్నారు.  విలువిద్యలో  అతని గురించి రెండు స్పెషల్ పుస్తకాలు రాశారు. పృథ్విరాజ్ విలువిద్య గురించి చాలా ప్రసిద్ధ కథలు ఉన్నాయి. స్వరం వినడం ద్వారానే తన లక్ష్యాన్ని చేధించే నేర్పుగల విలుకాఁడని ప్రసిద్ధి.

ఇవి కూడా చదవండి

మరిన్నిఎంటర్టైన్‌మెంట్  వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu