AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Cool Drink: వేసవి దాహార్తిని తీర్చే చల్లని వెరై ‘టీ’ రెసిపీ.. పుచ్చకాయ ఐస్ టీ తయారీ

టీ ప్రేమికులు వేసవిలో టీ తాగడానికి ఇబ్బంది పడతారు. అలాంటి వాటికోసం ఓ చల్లటి వెరైటీ 'టీ ' రెసిపీ గురించి ఈరోజు తెలుసుకుందాం..

Summer Cool Drink: వేసవి దాహార్తిని తీర్చే చల్లని వెరై 'టీ' రెసిపీ.. పుచ్చకాయ ఐస్ టీ తయారీ
Watermelon Iced Tea
Surya Kala
|

Updated on: May 11, 2022 | 4:50 PM

Share

Summer Cool Drink: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చల్లటి పానీయాల వైపు దృష్టి సారిస్తారు. అయితే కూల్ డ్రింక్స్ వంటి రసాయనాలతో ఉన్న పానీయాలను తీసుకునే కంటే.. సహజ పానీయాలు శరీరానికి మంచిది. ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత నీరు తాగాల్సి ఉంటుంది. మజ్జిగ, కొబ్బరి నీరు వంటి సహజ పానీయాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. ఆరోగ్యానికి మేలు కూడా. అయితే రోజు ఇవేనా అనిపిస్తాయి చాలామంది.. ముఖ్యంగా టీ ప్రేమికులు వేసవిలో టీ తాగడానికి ఇబ్బంది పడతారు. అలాంటి వాటికోసం ఓ చల్లటి వెరైటీ ‘టీ ‘ రెసిపీ గురించి ఈరోజు తెలుసుకుందాం.. టేస్టీగా ఉండే ఈ టీ   వేసవి వేడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు పుచ్చకాయ ఐస్ టీ రెసిపీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు

పుచ్చకాయ ముక్కలు – పుదీనా ఆకులు గ్రీన్​ టీ ఆకులు –  3 స్పూన్లు నిమ్మకాయలు – 2 పంచదార – లేదా తేనే (ఆప్షనల్) నీళ్లు- అరలీటరు చాట్ మసాల- 2 టేబుల్ స్పూన్స్

ఇవి కూడా చదవండి

తయారీ విధానం: ముందుగా స్టౌ వెలిగించి.. దానిమీద దళసరి గిన్నె పెట్టి.. నీరు పోసుకోవాలి. అందులో గ్రీన్ టీ ఆకులను వేసుకుని మరిగించాలి. అనంతరం నీటిని వడకట్టి.. చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన గ్రీన్ టీ నీటిని మిక్సీలో వేసుకుని.. దానిలో పుచ్చకాయ ముక్కలను వేసుకుని, పంచదార, మసాలా, పుదీనా ఆకులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఈ జ్యుస్ ని ఒక పాత్రలో వేసుకుని.. నిమ్మరసం వేసుకోవాలి.

అనంతరం ఒక గ్లాస్ ఆ జ్యుస్ ని వేసుకుని.. గ్లాస్ అంచుల చివర.. ఉప్పూకారం నిమ్మరసం కలుపుకున్న పదార్ధాన్ని పట్టించాలి. అనంతరం ఐస్ క్యూబ్స్ వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. వేసవి నుంచి ఈ పుచ్చకాయ ఐస్ టీ మంచి ఉపశనం ఇస్తుంది.

ఎండలో తిరిగివచ్చిన ఈ వాటర్ మిలన్ ఐస్ టీ ఓ వరం. శరీరానికి  చలువ జేస్తుంది. ఒక్కసారి టేస్టీ టేస్టీ పుచ్చకాయ ఐస్ టీని ట్రై చేయండి

మరిన్ని ఆహారం రెసిపీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..