AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack Risk: అలాంటి వారికి గుండెపోటు ప్రమాదం అధికం.. ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి..

గుండెపోటు రాకూడదనుకుంటే కొన్ని చెడు అలవాట్లను ఈరోజు నుంచే వదిలేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Heart Attack Risk: అలాంటి వారికి గుండెపోటు ప్రమాదం అధికం.. ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి..
Heart Attack
Shaik Madar Saheb
|

Updated on: May 11, 2022 | 8:57 AM

Share

Heart attack risk factors: ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గుండె వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలంటే గుండె ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. కానీ ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల గుండెను సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. దీంతో ఈ సమస్యలు మరింత పెరుగుతున్నాయి. గుండెపోటు రాకూడదనుకుంటే కొన్ని చెడు అలవాట్లను ఈరోజు నుంచే వదిలేయాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలాంటి వారికి గుండెపోటు ప్రమాదం అధికం..

  • ఊబకాయం లేదా బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడే వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉంటారు.
  • మీ కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత వ్యాధులుంటే.. అలాంటి వారికి కూడా ప్రమాదం ఉంటుంది.
  • అధిక రక్తపోటుతో బాధపడే వారికి గుండెపోటు రావచ్చు.
  • శారీరక శ్రమ లేకపోయినా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ అలవాటును వెంటనే మార్చుకోండి.
  • తగినంత నిద్ర లేని వారికి గుండె జబ్బులు వస్తాయి.
  • సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తినే సమయాన్ని మార్చుకోవడం ప్రమాదకరం.
  • వైద్యులను సంప్రదించకుండా మందులు వాడేవారు.
  • గుండె వేగంగా కొట్టుకోవడం, నెమ్మదిగా కొట్టుకోవడం కూడా ప్రమాదమే..

గుండెపోటును నివారించే మార్గాలు

ఇవి కూడా చదవండి
  • గుండెపోటు రాకూడదని మీరు కోరుకుంటే.. ముందుగా మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి. ఫైబర్ పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను తినండి.
  • ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. చాలా హానికరమైన కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోతుంది. అందుకే నూనె పదార్థాలను, బయటి తిండిని తినడం మానుకోండి.
  • మీరు రోజువారీ జీవితంలో వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే.. శారీరక శ్రమ కూడా పెరుగుతుంది. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • మీ బరువును క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. బరువును నియంత్రించడానికి అన్ని చర్యలను అనుసరించండి. పొట్ట కొవ్వు (బెల్లీ ఫ్యాట్) పెరగడం గుండెకు మంచిది కాదు.
  • ధూమపానం, మద్యపానం లాంటివి వెంటనే మానేయండి. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు మన జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది.
  • ఎక్కువ ఉప్పు అంటే సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తినవద్దు. ఇది రక్తపోటును పెంచుతుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Fruits for Arthritis: కీళ్ల నొప్పులతో అల్లాడుతున్నారా..? అయితే మూడు పండ్లను తప్పనిసరిగా తినండి..

Muskmelon Benefits: వేసవిలో కర్బూజను తింటున్నారా..? అయితే.. ఈ విషయాలపై లుక్కేయాల్సిందే..

Follow Us
TGPSC కీలక ప్రకటన: OTR Update గడువు మళ్లీ పొడిగింపు! వివరాలివే..
TGPSC కీలక ప్రకటన: OTR Update గడువు మళ్లీ పొడిగింపు! వివరాలివే..
శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?
శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?
ఏసీ అక్కర్లేదు! ఈ 5 సింపుల్‌ చిట్కాలతో మీ ఇల్లు సహజంగానే ఏసీలా
ఏసీ అక్కర్లేదు! ఈ 5 సింపుల్‌ చిట్కాలతో మీ ఇల్లు సహజంగానే ఏసీలా
గ్యాస్ కొరత.. దేశ ప్రజలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
గ్యాస్ కొరత.. దేశ ప్రజలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
కాజు మఖాన కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది బాసూ
కాజు మఖాన కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది బాసూ
డబ్బు ఖర్చులేదు..లాండ్రీకి వెళ్లనక్కర్లేదు! ఖరీదైన బట్టలను ఇంట్లో
డబ్బు ఖర్చులేదు..లాండ్రీకి వెళ్లనక్కర్లేదు! ఖరీదైన బట్టలను ఇంట్లో
దొంగలు రూటు మార్చారు జాగ్రత్త.. బైక్‌పై వచ్చి ఏం చేశారంటే..
దొంగలు రూటు మార్చారు జాగ్రత్త.. బైక్‌పై వచ్చి ఏం చేశారంటే..
అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. తమ డిమాండ్లకు ఓకే అంటేనే యుద్ధం..
అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. తమ డిమాండ్లకు ఓకే అంటేనే యుద్ధం..
నాగుపాముకే నరకం చూపించే మొనగాళ్లు.. కోబ్రా విషం వీటికి నీళ్లతో..
నాగుపాముకే నరకం చూపించే మొనగాళ్లు.. కోబ్రా విషం వీటికి నీళ్లతో..
కూతురి హత్యకు రివేంజ్..OTTలో దృశ్యం దర్శకుడి మరో క్రైమ్ థ్రిల్లర్
కూతురి హత్యకు రివేంజ్..OTTలో దృశ్యం దర్శకుడి మరో క్రైమ్ థ్రిల్లర్