Srilankan Crisis: వారిపై దయ చూపించొద్దు.. శ్రీలంక సంక్షోభంపై సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు
శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం తారస్థాయికి చేరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ఆందోళనకారులు.. పాలకులు, రాజకీయ నేతలు, ఉన్నత అధికారులే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తున్నారు.
Srilanka Crisis News: శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం తారస్థాయికి చేరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ఆందోళనకారులు.. పాలకులు, రాజకీయ నేతలు, ఉన్నత అధికారులే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో రాజకీయ నేతలు పలాయనం చిత్తగిస్తున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహెంద రాజపక్సె(Mahinda Rajapaksa) ఆ దేశ నావికా దళ బేస్‌లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంకలో నెలకొన్న సంక్షోభంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి(Subramanian Swamy) సంచల వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశం శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు భారత్ జోక్యం చేసుకోవాలని ఆయ సూచించారు. తక్షణం భారత సేనలను అక్కడకు పంపి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలంటూ మోడీ ప్రభుత్వానికి సూచించారు. తద్వారా శ్రీలంక రాజ్యాంగ పవిత్రను కాపాడాలని కోరారు. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న ప్రజాగ్రహాన్ని భారత వ్యతిరేక విదేశీ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు.
ఆందోళనకారులు శ్రీలంక దేశ ప్రధాని నివాసాన్ని దగ్ధం చేయడం.. ఎంపీలను కాల్చి చంపడం దారుణమని స్వామి పేర్కొన్నారు. అక్కడ హింసకు పాల్పడుతున్న అల్లరిమూకలపై ఎలాంటి దయాదాక్షణ్యాలు చూపించకూడదన్నారు. పొరుగు దేశం శ్రీలంక మరో లిబియా కాకుండా చూడాలని భారత ప్రభుత్వానికి స్వామి సూచించారు.
బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీట్..
Burning down the residences even of the Prime Minister, shooting dead MPs by mobs means rioters don’t deserve any mercy. We cannot allow another Libya in our neighbourhood.
— Subramanian Swamy (@Swamy39) May 11, 2022
మహేంద రాజపక్సె కుటుంబంతో సుబ్రమణ్య స్వామికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా శ్రీలంక సంక్షోభంపై చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. మహెంద రాజపక్సె వ్యతిరేకులు స్వామి ట్వీట్‌ను వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తనకు సన్నిహితుడైన రాజపక్సె రాజ్యం కూలుపోతుండటం తట్టుకోలేకే స్వామి ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం వెనుక విదేశీ శక్తుల హస్తం లేదని.. భారత్ భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. విదేశీ సేనలు శ్రీలంక అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని సూచించారు.
శ్రీలంకలో సంక్షోభం ముదిరిన నేపథ్యంలో అక్కడికి తమ సేనలను పంపే యోచన ఏదీ లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసింది. శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు భారత సేనలను పంపనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..
Also Read..
Taj Mahal Controversy: తాజ్ మహల్ నిర్మించిన భూమి తమదే అంటున్న జైపూర్ మాజీ యువరాణి.. ఆదారాలతో రె’ఢీ’