AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bill Gates: బిల్‌ గేట్స్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో ఉన్నానంటూ మైక్రోసాఫ్ట్ దిగ్గజం ట్వీట్..

సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారే వరకు తాను ఐసోలేషన్‌లోనే ఉంటానని.. తాను వైద్యుల సలహాలను అనుసరిస్తున్నానని బిల్ గేట్స్ తెలిపారు.

Bill Gates: బిల్‌ గేట్స్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో ఉన్నానంటూ మైక్రోసాఫ్ట్ దిగ్గజం ట్వీట్..
Bill Gates
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 11, 2022 | 9:18 AM

Bill Gates Tests Covid-19 Positive: సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని.. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ఈ మేరకు బిల్ గేట్స్ ట్విట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారే వరకు తాను ఐసోలేషన్‌లోనే ఉంటానంటూ పేర్కొన్నారు. తాను వైద్యుల సలహాలను అనుసరిస్తున్నానని తెలిపారు. పూర్తిస్థాయిలో కరోనా టీకాలు తీసుకున్నానని ఈ సందర్భంగా ట్విట్ లో తెలిపారు.

కాగా.. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు బిల్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా బిల్ గేట్స్ పలు పేద దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాలను అందజేశారు. అదేవిధంగా యాంటీవైరల్ జనరిక్‌ కరోనా పిల్స్‌ను సరఫరా చేసేందుకు తన ఫౌండేషన్ తరపున 120 మిలియన్ల డాలర్లను అందించి ఆదర్శంగా నిలిచారు. దీంతోపాటు కరోనా సమయంలో బిల్ గేట్స్ ఉద్యోగులకు, సిబ్బందికి కూడా బాసటగా నిలిచారు. ప్రస్తుతం కరోనా నియంత్రణ కోసం పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Also Read:

Narayana Arrest: జోక్యం చేసుకుని న్యాయం చేయండి.. హోంమంత్రి అమిత్ షా, గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..

Sukh Ram Passes Away: కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూత.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ..