AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukh Ram Passes Away: కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూత.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ..

సుఖ్ రామ్‌కు మే 4న మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్ రాగా.. కుటుంబసభ్యులు మండిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు మే 7న తరలించారు.

Sukh Ram Passes Away: కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూత.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ..
Pandit Sukh Ram
Shaik Madar Saheb
|

Updated on: May 11, 2022 | 8:34 AM

Share

Pandit Sukh Ram passes away: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ (94) కన్నుమూశారు. సుఖ్ రామ్ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు సుఖ్ రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ మంగళవారం అర్థరాత్రి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేశారు. సుఖ్ రామ్‌తో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోను శర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కాగా.. సుఖ్ రామ్‌కు మే 4న మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్ రాగా.. కుటుంబసభ్యులు మండిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు మే 7న తరలించారు. మాజీ కేంద్ర మంత్రి పండిట్ సుఖ్‌రామ్ మరణవార్త చాలా బాధాకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని హిమాచల్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.. సుఖ్ రామ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

కాగా.. సుఖ్ రామ్ 90వ దశకంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. పండిట్ సుఖరామ్ 1996లో పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో టెలికాం మంత్రిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనపై పెద్ద ఎత్తున స్కామ్‌ ఆరోపణలు రావడంతో.. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది. అప్పట్లో పండిట్ సుఖరామ్ ఇంట్లో రూ.3.6 కోట్లు దొరకడం దుమారం రేపింది. దీంతోపాటు ఢిల్లీ కోర్టు సైతం సుఖ్‌రామ్‌ను టెలికాం స్కాంలో దోషిగా నిర్ధారించి ఐదేళ్లపాటు శిక్ష విధించింది.

కాగా.. స్కామ్‌లో సుఖ్ రామ్ పేరు రావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత ఆయన 1997లో హిమాచల్‌ వికాస్‌ కాంగ్రెస్‌ను స్థాపించారు. 1998లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు.

ఇవి కూడా చదవండి

Also Read:

Narayana Arrest: జోక్యం చేసుకుని న్యాయం చేయండి.. హోంమంత్రి అమిత్ షా, గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..

Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలకు అదే కారణమవ్వొచ్చు.. నీతి ఆయోగ్ సంచలన వ్యాఖ్యలు..