కోమాలో ఉన్న యువకుడు.. రెండుసార్లు సోకిన కరోనా.. అయినా కోలుకుంటున్నాడు.. ఎక్కడంటే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Feb 09, 2021 | 2:04 PM

ఒక యువకుడు అత్యంత వేగంగా కారును ఢీకోట్టి ఒక సంవత్సరంపాటు కోమాలోకి వెళ్లిపోయాడు. కోమాలో ఉండగానే అతడికి రెండుసార్లు కరోనా సోకింది.

కోమాలో ఉన్న యువకుడు.. రెండుసార్లు సోకిన కరోనా.. అయినా కోలుకుంటున్నాడు.. ఎక్కడంటే..

ఒక యువకుడు అత్యంత వేగంగా కారును ఢీకోట్టి ఒక సంవత్సరంపాటు కోమాలోకి వెళ్లిపోయాడు. కోమాలో ఉండగానే అతడికి రెండుసార్లు కరోనా సోకింది. యావత్ ప్రపంచాన్ని వణికించిన వైరస్ గురించి అతనికి తెలియదు. ప్రస్తుతం అతడు క్రమంగా కోలుకుంటున్నాడు.

బ్రిటన్‏కు చెందిన 19 ఏళ్ళ జోసెఫ్ ప్లావిల్ అనే యువకుడు గతేడాది మార్చి 1న సెంట్రల్ ఇంగ్లీష్ పట్టణం బర్టన్ ఆన్ ట్రెంట్లో రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. వేగంగా వస్తున్న ఓ కారు అతడిని ఢీకోట్టడంతో అతని మెదడుకు బలమైన గాయం అయ్యింది. దీంతో జోసెఫ్ కోమాలోకి వెళ్లాడ. బ్రిటన్లో కరోనా సోకి లాక్ డౌన్ విధించడానికి మూడు వారాల ముందు ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో అతడిని చూడటానికి ఎవరిని అనుమతించలేదు అక్కడి డాక్టర్లు. దీంతో సంవత్సరంపాటు అతడికి తన కుటుంబసభ్యులు దూరంగా ఉండాల్సి వచ్చింది.

అయితే ప్రస్తుతం జోసెఫ్ కోమా నుంచి మెల్లగా కోలుకుంటున్నాడు. ఈ విషయం తమకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని అతడి బందువు సాలీ ఫ్లావిల్ తెలిపారు. కాగా జోసెఫ్ ప్రస్తుతం తమ సైగలను అర్ధం చేసుకోని కళ్లతో సమాధానం చెబుతున్నాడని.. కానీ యావత్ ప్రపంచాన్ని భయందోళనలకు గురిచేసిన కరోనా గురించి అతడికేం తెలియదన్నారు. అయితే జోసెఫ్ ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళిన తర్వాత బ్రిటన్‏లో దాదాపు 40 లక్షల మంది కరోనా భారీనపడ్డారు. ఇందులో 1,10,000 మందికి పైగా మరణించారని ఆ దేశ వైద్య శాఖ వెల్లడించిది. కోమాలో ఉన్న అతడికి రెండు సార్లు కరోనా సోకింది. కానీ ఈ విషయం అతనికి తెలియదు. అయితే సంవత్సరానికి పైగా ఆసుపత్రిలో ఉన్న ఆ యువకుడు చికిత్స కోసం అతని కుటుంబం ఆన్ లైన్లో ప్రచారం చేసి నిధులు సేకరించాలని అతని బంధువు సాలీ తెలిపారు.

Also Read:

Corona Test For Animals: ఇక నుంచి పెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా పరీక్షలు.. ఎక్కడంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu