Corona Test For Animals: ఇక నుంచి పెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా పరీక్షలు.. ఎక్కడంటే..

దక్షిణ కొరియా రాజధాని సియోల్‏లో పెంపుడు శునకాలు, పిల్లులకు ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న

Corona Test For Animals: ఇక నుంచి పెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా పరీక్షలు.. ఎక్కడంటే..
Coronavirus tests for pets
Follow us

|

Updated on: Feb 09, 2021 | 1:14 PM

దక్షిణ కొరియా రాజధాని సియోల్‏లో పెంపుడు శునకాలు, పిల్లులకు ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న పెంపుడు పిల్లులు, కుక్కలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం సోమవరం తెలిపింది.

దక్షిణ కొరియాలో జంజు నగరానికి చెందిన ఓ మత సంస్థలో సభ్యులైన మహిళకు, ఆమె కుమార్తెకు కోరనా సోకింది. అనంతరం వారి పెంపుడు పిల్లికి కూడా కరోనా సోకింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం పెంపుడు జంతువుల్లో సోకుతున్న కరోనాకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ రోజు నుంచి సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం పెంపుడు కుక్కలు మరియు పిల్లులకు కరోనా పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆ నగర అధికారి వ్యాధి నియంత్రణ నిర్వహణ పార్క్ యూ విలేకరులతో తెలిపారు.

జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు మరియు ముక్కు కారటం వంటి లక్షణాలు ఉన్న పెంపుడు జంతువులకు మాత్రమే ఈ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని.. పాజిజిట్ వచ్చిన మనుషులతో జంతువులకు సంబంధాలు ఉంటే చేస్తామని తెలిపారు. డాక్టర్స్ మరియు వైద్య సిబ్బందితో కలిసి ఇంటి సమీపంలోనే పెంపుడు జంతువులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పాజిటివ్ వచ్చిన జంతువులను ఇంట్లో 14 రోజులు ఒంటరిగా ఉంచాల్సిన అవసరం ఉందని.. కానీ యజమానులకు వైరస్ ఉంటే.. వారి పెంపుడు కుక్కులు, పిల్లులను ప్రత్యేక గదిలో ఉంచాలని తెలిపారు. ఆ దేశంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఆసుపత్రిలో కాకుండా హోంఐసోలేషన్‏లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Also Read: కరోనా లక్షణాలు చాలా ఇబ్బంది పెట్టాయి.. ఎవరో నాపై అదిమి కూర్చునట్లు అనిపించేది: హాలీవుడ్ నటుడు