Britain: కరోనా కాలంలో లాభాలు ఆర్జించిన కంపెనీలపై దృష్టి పెట్టనున్న బ్రిటన్ ప్రభుత్వం.. ఎక్కువ పన్ను విధించే ఆలోచనలో..
కరోనా సమయంలో ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జించిన కంపెనీలపై బ్రిటన్ ప్రభుత్వం దృష్టి పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. కరోనా సమయంలో లాభాలు ఆర్జించిన..
Britain Impose Higher Taxes On Tech Firms: కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా నుంచి ఆంధ్రా వరకు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వైరస్ ప్రభావం పడింది. ఆరోగ్యం నుంచి మొదలు ఆర్థిక రంగం వరకు కరోనా ప్రభావానికి గురికాక తప్పలేదు.
ఇదిలా ఉంటే ఓ వైపు కరోనా కారణంగా ఎన్నో కంపెనీలు దివాలా తీసినా.. మరికొన్ని మాత్రం లాభాలు గడించాయి. తాజాగా ఇలా కరోనా సమయంలో ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జించిన కంపెనీలపై బ్రిటన్ ప్రభుత్వం దృష్టి పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. కరోనా సమయంలో లాభాలు ఆర్జించిన కొన్ని టెక్ కంపెనీలపై ఈసారి ఎక్కువ పన్ను విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయట. ఇక ఈ కంపెనీలపై ఆన్‌లైన్ సేల్స్ ట్యాక్స్ విధిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే టెక్ కంపెనీలతో సమావేశం కూడా నిర్వహించారు. కరోనా సమయంలో లాభాలు ఆర్జించిన సంస్థలపై అధిక పన్ను విధించాలని కూడా ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Also Read: ఈజీ మనీ కోసం ఆశపడ్డాడు.. లైవ్ స్ట్రీమింగ్‌లో ఏకంగా 1.5 లీటర్ల వోడ్కా తాగాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!