AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11ఏళ్లుగా ఆదాయం లేని ఆ సంస్థ..విద్యుత్ వాహనాల రారాజు టెస్లాను బీట్ చేస్తూ 8నెలల్లో 3,000% పెరిగిన షేర్ల విలువ

ఒకానొక దశలో దివాళా తీయడానికి కూడా రెడీ అయ్యింది.. అయితే ఇప్పుడు ఆ సంస్థ షేర్ల ధర ఓ రేంజ్ లో పెరిగింది. ఎంతగా అంటే విద్యుత్ వాహనాల రారాజు టెస్లాను మించి షేర్ విలువ నమోదవుతూ అందరికీ షాక్ ఇస్తోంది.. మరి ఆ సంస్థ ఏమిటో..

11ఏళ్లుగా ఆదాయం లేని ఆ సంస్థ..విద్యుత్ వాహనాల రారాజు టెస్లాను బీట్ చేస్తూ 8నెలల్లో 3,000% పెరిగిన షేర్ల విలువ
Surya Kala
|

Updated on: Feb 09, 2021 | 4:17 PM

Share

Blink Charging: వ్యాపారంలో సక్సెస్ కావాలంటే.. ముందుగా కావాల్సింది మార్కెట్ పై అవగాహన.. డిఫరెంట్ ఆలోచన.. అంతకుమించి తాము పెట్టిన బిజినెస్ సక్సెస్ కోసం ఎదురు చూసే ఓపిక ఇవన్నీ ఉంటె ముదుపరులను ఈజీగా ఆకట్టుకోవచ్చు.. మార్కెట్ రంగంలో సక్సెస్ అందుకోవచ్చు అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఓ సంస్థ.. ఆ సంస్థకు పెద్దగా ఆదాయం లేదు.. ఇంకా చెప్పాలంటే 11 ఏళ్లుగా లాభాలను పొందింది లేదు.. ఇంకా చెప్పాలంటే ఒకానొక దశలో దివాళా తీయడానికి కూడా రెడీ అయ్యింది.. అయితే ఇప్పుడు ఆ సంస్థ షేర్ల ధర ఓ రేంజ్ లో పెరిగింది. ఎంతగా అంటే విద్యుత్ వాహనాల రారాజు టెస్లాను మించి షేర్ విలువ నమోదవుతూ అందరికీ షాక్ ఇస్తోంది.. మరి ఆ సంస్థ ఏమిటో తెలుసుకుందాం..!

అమెరికాలో చార్జింగ్ కో అనే సంస్థ షేర్లు అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఎంతగా అంటే.. గత 8 నెలల్లోనే ఆ సంస్థ షేరు విలువ 3,000 శాతం పెరిగింది మరి. దీనికి కారణం ఏమిటింటే.. బ్లింక్ చార్జింగ్ కో సంస్థ విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకునేలా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.. మొదట్లో ఈ సంస్థకు ఆదరణ అంతగా లేదు.. కానీ అమెరికాలో పర్యావరణ హిత ఇంధన సంస్థలకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. అదే బ్లింక్ కు కలిసి వచ్చింది. మదుపరులు దానిపై మక్కువ పెంచుకునేలా చేసింది.

అయితే మార్కెట్ లోని 2,700 స్టాక్ లలో.. ఈ 8 నెలల కాలంలో ఏడు కంపెనీలే వంద కోట్ల డాలర్లకుపైగా నిధులను సమీకరించాయి. అందులో బ్లింక్ కూడా ఒకటంటేనే దానికి ఎంతలా ఆదరణ లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. మార్కెట్ లో 217 కోట్ల డాలర్ల విలువున్న కంపెనీ అమ్మకాల నిష్పత్తి 481కి పెరిగింది. అదే విద్యుత్ కార్లకు పెట్టింది పేరైన టెస్లా అమ్మకాల నిష్పత్తి కేవలం 26.

నిజానికి విద్యుత్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అనేది చాలా చిన్న విషయమని.. ఇది ఇంకా ప్రారంభదశలోనే ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పరిశ్రమ ఆదాయం కూడా తక్కువని.. అందుకే బ్లింక్ గత ఏడాది ఆదాయం కూడా కేవలం 55 లక్షల డాలర్లేనని రేమండ్ జేమ్స్ అండ్ అసోసియేట్ కు చెందిన విశ్లేషకుడు పావెల్ మొల్కనోవ్ చెప్పారు. కాగా అమెరికాలో తమకు 6,944 చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని బ్లింక్ చెప్పారు.

Also Read:

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్