Ravindrasinh Jadeja Lion Pic: సోషల్ మీడియాలో సింహంతో ఫోటో షేర్ చేసి.. మళ్ళీ వివాదంలో ఇరుకున్న రవీంద్ర జడేజా

బర్ద్ ఫ్లూ సమయంలో చేపలకు పక్షులకు ఆహారం వేసి ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ వివాదాల్లో ఇరుక్కోగా.. ఇప్పుడు సింహం పిల్లతో ఉన్న వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసి మరో క్రికెటర్ కాంట్రవర్సీగా మారాడు.

Ravindrasinh Jadeja Lion Pic:  సోషల్ మీడియాలో సింహంతో ఫోటో షేర్ చేసి.. మళ్ళీ వివాదంలో ఇరుకున్న రవీంద్ర జడేజా
Follow us
Surya Kala

|

Updated on: Feb 09, 2021 | 3:20 PM

Ravindrasinh Jadeja Lion Pic: బర్ద్ ఫ్లూ సమయంలో చేపలకు పక్షులకు ఆహారం వేసి ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ వివాదాల్లో ఇరుక్కోగా.. ఇప్పుడు సింహం పిల్లతో ఉన్న వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసి మరో క్రికెటర్ కాంట్రవర్సీగా మారాడు. వివరాల్లోకి వెళ్తే..

భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడెజా సింహం పిల్లతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటో తో మళ్ళీ రవీంద్ర జడేజా తనకు తెలియకుండానే వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఎందుకంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ ఐ కేటగిరీలో ఉన్న జంతువులతో ఫోటోలు తీసుకోకూడదు. అయితే ఇప్పుడు రవీంద్ర జడేజా సింహంతో దిగిన ఫోటో షేర్ చేయడంతో అతను నేరం చేశాడంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫోటో గుజరాత్ లో తీసుకున్నది కాదు. ఆఫ్రికన్ సింహం అని అటవీ అధికారులు తెలిపారు.

ఈ వివాదం లో రవీంద్ర స్వయంగా ఇరుక్కున్నాడు.. జడేజా ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశాడు.. ఆ వీడియోలో రాత్రి పూట మూడు సింహాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాయి. ఈ వీడియోను తీసిన జడేజా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో లాస్ట్ లో సింహంలు వాటి పిల్లలతో దిగిన ఫోటో ఒకటి షేర్ చేశాడు.. ఆ వీడియో తో పాటు గొప్ప అనుభవం.. ఈ రోడ్డు ట్రిప్ లో మంచి అనుభూతి పొందాను అంటూ ఓ క్యాప్షన్ పెట్టాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

కొంతమంది నెటిజన్స్ ఆ ఫోటో గుజరాత్ సింహాలతో దిగినవి అంటూ అటవీశాఖ అధికారులు కు ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే అటవీ చట్టాల ప్రకటం సింహంతో ఫోటోలు దిగడం నేరం.. దీంతో అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. రవీంద్ర జడేజా సింహంతో ఉన్న ఫోటోలను పరిశీలించాం.. అయితే ఆ ఫోటోలు గుజరాత్ లోవి కాదు.. ఆఫ్రికా సింహాలు అని అటవీశాఖ అధికారి తెలిపారు. అంతేకాదు ఈ ఫోటో ఇప్పటిది కాదని 2018 లో దక్షణాఫ్రికా టూర్ దిగినవని తెలుస్తోంది. మరి ఆ అప్పటి ఫోటోలను వీడియో ఇప్పుడు ఎందుకు షేర్ చేసి వివాదాల్లో ఇరుకున్నాడో అంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే గతంలో కూడా ఇటువంటి తప్పే చేసి ఫైన్ కూడా కట్టాడు. 2016 లో గుజరాత్ సింహాల దగ్గర ఫోటోల్ని దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో గుజరాత్ అటవీ శాఖ జడేజాకు 20 వేల రూపాయల జరిమానా చెల్లించాడు.

Also Read:

 తొలి టెస్టులో చేతులెత్తేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. 227 పరుగుల తేడాతో పరాజయం..

డిఫరెంట్ క్యాస్టూమ్స్ తో బరిలోకి దిగిన సెరీనా విలియమ్స్.. దాని వెనుక ఉన్న కథ ఏమిటంటే..!