Ind Vs Eng: తొలి టెస్టులో చేతులెత్తేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. 227 పరుగుల తేడాతో పరాజయం..

India Vs England: చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతుల్లో టీమిండియా ఓటమిపాలైంది. 232 పరుగుల తేడాతో ఘోర ఓటమిని...

Ind Vs Eng: తొలి టెస్టులో చేతులెత్తేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. 227 పరుగుల తేడాతో పరాజయం..
England Wins 1st Test
Follow us

|

Updated on: Feb 09, 2021 | 1:42 PM

India Vs England: చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతుల్లో టీమిండియా ఓటమిపాలైంది. 227 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. 39 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. 192 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(72), గిల్(50) అర్ధ శతకాలు చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్ నాలుగు వికెట్లు, ఆండర్సన్ మూడు వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బ తీశారు. దీనితో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యం సంపాదించింది. కాగా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జో రూట్ ఎంపికయ్యాడు.

ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు..

అంతకముందు 241 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్‌ను.. అశ్విన్ బెంబేలెత్తించాడు. ఇంగ్లాండ్ భారీ టార్గెట్ నిర్దేశించకుండా నిలువరించాడు. కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాకు 420 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రూట్(40) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు..

ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. 257/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 80 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్(85*) రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్ నాలుగు వికెట్లు.. ఆర్చర్, లీచ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు..

అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు. అటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెస్(34) కూడా రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్, నదీమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు.

RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే