Covid-19 Pill: కరోనా చికిత్సలో నూతన అధ్యాయం.. ‘మాల్నుపిరవిర్’ ట్యాబ్లెట్‌కు బ్రిటన్ ఆమోదం..
Covid-19 treatment pill: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పీడ ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో
Covid-19 treatment pill: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పీడ ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దీనికోసం.. ఇప్పటివరకు పలు వ్యాక్సిన్లనే అందిస్తూ వస్తున్నారు. తాజాగా కరోనా నుంచి రక్షణకు మాత్ర (డ్రగ్) కూడా అందుబాటులోకి వచ్చింది. నోటిద్వారా అందించే మాత్రకు బ్రిటన్ ఆమోదం తెలిపింది. మాల్నుపిరవిర్ పేరుతో తయారైన ఈ యాంటీ వైరల్ పిల్‌ను మెర్క్, రిట్జ్ బ్యాక్ బయోథెరపిటిక్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ పిల్ వినియోగానికి బ్రిటన్ దేశం ఆమోదముద్ర వేసి.. ప్రపంచంలోనే తొలి దేశంగా రికార్డుల్లోకెక్కింది.
ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించిన లేదా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన ఐదు రోజుల్లోగా ఈ మాత్రను వేసుకునేందుకు ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆమోదం తెలుపుతూ.. ఉత్తర్వులు జారీచేసింది. కరోనా ప్రారంభ దశలో, తర్వాత మాల్నుపిరవిర్ అత్యధిక ప్రభావంతంగా పనిచేసినట్లు ట్రయల్స్‌లో వెల్లడైందని తెలిపింది. ఈ మాత్ర ద్వారా ఆసుపత్రి పాలవ్వడం, మరణ అవకాశాలు తగ్గుతాయని పేర్కొంది. కాగా.. 4.80 లక్షల కోర్సుల మాల్నుపిరవిర్ పిల్స్‌ను కొనుగోలు చేసేందుకు గత నెలలోనే బ్రిటన్ ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుంది.
ఈ ఏడాది చివరికల్లా ఒక కోటి కోర్సుల పిల్స్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్ధారించుకున్నామని.. ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది. ఇదిలాఉంటే.. ఈ పిల్‌పై అమెరికా ఈ నెలలో నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: