Melinda Gates: మెలిండాకు డైవోర్స్ ఇవ్వాలన్న నిర్ణయం తప్పే ! అంగీకరించిన బిల్ గేట్స్ … అయితే ‘ఎఫైర్’ ఆరోపణలపై ఖండన
27 ఏళ్ళ వైవాహిక బంధం అంత ఈజీగా తెగిపోతుందా..? కానీ మధ్యలో మరో లేడీ ఎంటరయితే ఇక బ్రేకప్ తప్పకపోవచ్చు.. బిల్ గేట్స్, మెలిండా గేట్స్ మధ్య జరిగింది ఇదే... ఇన్నేళ్ల కాపురం చేసిన తాము ఇక విడిపోతామని గత మే 4 న వీరిద్దరూ ప్రకటించారు.కాగా ...
27 ఏళ్ళ వైవాహిక బంధం అంత ఈజీగా తెగిపోతుందా..? కానీ మధ్యలో మరో లేడీ ఎంటరయితే ఇక బ్రేకప్ తప్పకపోవచ్చు.. బిల్ గేట్స్, మెలిండా గేట్స్ మధ్య జరిగింది ఇదే… ఇన్నేళ్ల కాపురం చేసిన తాము ఇక విడిపోతామని గత మే 4 న వీరిద్దరూ ప్రకటించారు. కాగా తమ బ్రేకప్ పై బిల్ గేట్స్ ఇన్నాళ్లకు నోరు విప్పారు. గతవారం జరిగిన ‘సమ్మర్ క్యాంప్ ఫర్ బిలియనీర్స్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ఒక దశలో కంట తడిపెట్టినంత పని చేశారు. మెలిండాతో డైవోర్స్ వ్యవహారం, ఇక మీ ఆధ్వర్యంలోని గేట్స్ ఫౌండేషన్ భవితవ్యం ఏమిటన్న ప్రశ్నకు ఆయన డైవోర్స్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం తప్పేనన్నారు. అయితే మరో మహిళతో తనది ‘ఎఫైర్’ అన్నదాన్ని ఒప్పుకోనని, అసలు ఆ పదమే సరికాదని అన్నారు. తన సహోద్యోగితో ఆయన రాసలీలలు జరిపాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎప్పుడో 2000 సంవత్సరంలోనిదని కూడా ఈ వార్తలు పేర్కొన్నాయి. నిజానికి ఏడాది కాలంగా బిల్ గేట్స్, మెలిండా వేర్వేరుగా ఉంటున్నారు.
2019 నుంచే తన భర్తను ఆమె దూరం పెడుతూ వచ్చిందట. అప్పటి నుంచే విడాకుల విషయమై తన లాయర్లతో ఆమె సంప్రదిస్తూ వచ్చినట్టు తెలిసింది. తన సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగితో బిల్ గేట్స్ కి సంబంధాలు ఉన్నాయని ఆమె అనుమానిస్తూ వచ్చింది. 2013 నుంచే ఆమెలో ఈ సందేహాలు మొదలయ్యాయట.ఇక వీరి ధార్మిక సంస్థ బిల్ గేట్స్ అండ్ మెలిండా ఫౌండేషన్ వ్యవహారానికే వస్తే..తన భార్యకు ఈయన విడాకులు ఇచ్చిన తక్షణం మెలిండా ఈ సంస్థ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమెకు ఈయన పెద్ద మొత్తంలో ‘భరణం’ ఇచ్చుకోవలసిందే..కోట్లాది డాలర్ల విరాళాలు ఇచ్చే ఈ సంస్థ ఫ్యూచర్ మాత్రం ఇప్పుడైతే అనుమానాస్పదంగానే ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి : రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం.:Jr.NTR ReEntry Politics Live Video.
భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..! జలమయంగా మారిన మహానగరం..:Heavy Rains Live Video.