AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Bicycle Day: సైకిల్‌ ఒక మిరాకిల్‌.. బైస్కిల్‌ వాడకం వల్ల శరీరానికి ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

World Bicycle Day: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు సైకిల్‌ను ఎక్కువగా ఉపయోగించే వారు రానురాను బైక్‌లు, కార్లను ఉపయోగిస్తున్నారు. ఎన్నెన్నో సౌకర్యాలు వచ్చి సైకిల్‌ వాడకం మరుగున..

World Bicycle Day: సైకిల్‌ ఒక మిరాకిల్‌.. బైస్కిల్‌ వాడకం వల్ల శరీరానికి ఎన్ని ఉపయోగాలో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Jun 03, 2022 | 4:26 PM

Share

World Bicycle Day: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు సైకిల్‌ను ఎక్కువగా ఉపయోగించే వారు రానురాను బైక్‌లు, కార్లను ఉపయోగిస్తున్నారు. ఎన్నెన్నో సౌకర్యాలు వచ్చి సైకిల్‌ వాడకం మరుగున పడిపోయింది. సైకిల్‌ అనేది సరళమైన, సరసమైన, పర్యావరణ అనుకూల రవాణా మార్గంగా చెప్పవచ్చు.సైకిల్‌ అభివృద్ధికి ఒక సాధనంగా, విద్య, ఆరోగ్య సంరక్షణ క్రీడలు నిర్వహించేందుకు కూడా ఉపయోగిస్తుంటారు ఈ సైకిల్‌ను. సైకిల్‌ వాడకం వినియోగదారుకు స్థానిక వాతావరణం గురించి తక్షణ ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. జూన్‌ 3వ తేదీన ప్రపంచ సైకిల్‌ దినోత్సవం (World Bicycle Day) జరుపుకొంటారు. 2018 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం కోసం లెస్జెక్ బైస్కిల్స్‌ అనే ఓ సామాజికవేత్త ప్రచారం. తుర్క్మనిస్తాన్‌ 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రొఫెసర్‌ స్వన్సన్‌ సహకారంతో ఐజాక్‌ ఫెల్డ్‌ ప్రపంచ సైకిల్‌ దినోత్సవం కోసం లోగోను తయారు చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల ద్విచక్ర వాహనదారులకు చిహ్నంగా ఉంది.

ప్రాముఖ్యత:

సమాజంలో సైక్లింగ్‌ సంస్కృతిని ఎంతో డెవలప్‌ చేయడానికి, ప్రోత్సహించడానికి కావాల్సిన ఉత్తమ పద్దతులను సరైన మార్గాలను అవలంబించేలా సభ్య దేశాలను ప్రోత్సహిస్తుంది. రహదారి భద్రతను మెరుగుపర్చడానికి సభ్య దేశాలను ప్రోత్సహించడమే కాకుండా పాదచారుల భద్రతను కాపాడడానికి సైకిల్‌ వాడకాన్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. శారీరక శ్రమను బలోపేతం చేయడానికి.., సైకిల్‌ నేది శారీరక శ్రమను బలోపేతం చేయడానికి, వ్యాధులను నివారించేందుకు, అంతేకాకుండా సహనాన్ని ప్రోత్సహించడానికి, సామాజిక దూరాలను సులభతరం చేయడానికి సాధారణంగా సైకిల్‌ వాడకం గురించి చెప్పడమే సైకిల్‌ ముఖ్య ఉద్దేశం.పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజు పెరుగుతున్న నేపథ్యంలో సైకిళ్లు కొనేందుకు, సైకిళ్లపై వెళ్లేందుకు ఇప్పటికి కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. తాత, తండ్రుల నుంచి సైకిల్‌ రిపేరు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న కుటుంబాలు కూడా ఇప్పటి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సైకిల్‌ తొక్కడం ద్వారా మంచి వ్యాయమం

ఇక సైకిల్‌ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. శారీరక వ్యాయమానికి సైకిల్‌ తొక్కడం ఎంతో మంచిది. బీపీ, మధుమోహం లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. రోజుకు ఐదారు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అంతేకాదు సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం హుషారుగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని చెబుతుంటారు పెద్దలు. సైకిల్‌ తొక్కడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

సైక్లింగ్ వల్ల మనకు ఎన్ని క్యాలరీలు తగ్గుతాయి..?

మానవ శరీరంలో ఒక పౌండ్ బరువు తగ్గాలంటే ఏకంగా 3500 కేలరీల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మామూలుగా ఇతర వ్యాయమాలు చేయడం ద్వారా క్యాలరీలు కరుగుతాయి. కాకపోతే కాస్త ఎక్కువ సమయం పడుతుంది.అదే సైక్లింగ్ చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీలను తక్కువ సమయంలోనే కరిగించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.సైకిల్‌ను కేవలం ఓ గంటసేపు తొక్కితే మన శరీరంలోని 400 కేలరీలను ఖర్చు చేయవచ్చు. ఇలా వారానికి కనీసం 5 నుండి 7 గంటల వరకు సైకిల్ ను తొక్క గలిగితే ఓ వారం రోజుల్లో ఓ పౌండ్ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

సైకిల్ తొక్కడానికి ఎక్కడపడితే అక్కడ కాకుండా సాఫీగా ఉన్న రోడ్డుపై తొక్కడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా సైకిల్‌ను తొక్కే సమయంలో అందుకు సంబంధించి షూస్, అలాగే వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది. సైకిల్ తొక్కడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ప్రతిరోజు ఈ సైక్లింగ్ చేయడం ద్వారా మన శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు చేయడం ద్వారా గుండె నొప్పిని కలుగజేసే సమస్యలను కొద్దిమేర తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అంతేగాక ఈ సైకిల్ తొక్కడం ద్వారా మన మనస్సు మానసికంగా ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుందని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి