Scripps National Spelling Bee 2022: మరోసారి స్పెల్ బీ మనదే.. విజేతగా భారత సంతతికి చెందిన బాలిక..

Scripps National Spelling Bee 2022: ‘స్పెల్ బీ 2022’లో భారత సంతతికి చెందిన బాలిక సత్తా చాటింది. ఇండియన్ ఆర్జిన్ అయిన హరిణి లోగన్

Scripps National Spelling Bee 2022: మరోసారి స్పెల్ బీ మనదే.. విజేతగా భారత సంతతికి చెందిన బాలిక..
Spell Bee
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 03, 2022 | 1:38 PM

Scripps National Spelling Bee 2022: ‘స్పెల్ బీ 2022’లో భారత సంతతికి చెందిన బాలిక సత్తా చాటింది. ఇండియన్ ఆర్జిన్ అయిన హరిణి లోగన్ స్పెల్లింగ్ బీ 2022 విజేతగా నిలిచింది. టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియోకు చెందిన లోగాన్.. మెరుపు వేగంతో టాస్క్ కంప్లీ్ట్ చేసి.. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేతగా నిలిచింది. కేవలం 90 సెకన్లలో వర్డ్ తరువాత వర్డ్ స్పెల్లింగ్ చకచకా చెబుతూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చారిత్రాత్మక స్పెల్ ఆఫ్‌లో హరిణి 22 పదాలను కరెక్ట్‌గా చెప్పిందని, స్క్రిప్ నేషనల్ స్పెల్లింగ్ బీ ట్వీట్ చేసింది. ఇక ఈ స్పెల్లింగ్ పోటీలో విక్రమ్ రాజు రెండవ స్థానంలో నిలిచాడు. 15 పదాల స్పెల్లింగ్స్‌ను సరిగా చెప్పాడు. కాగా, హరిణి లోగాన్‌ను విజేతగా నిలిపిన పదం ‘moorhen’. ఇది ఒక రకమైన నీటి పక్సి. ఈ విజయంతో హరిణి ఉబ్బితబ్బిబ్బైపోయింది. తాను ఛాంపియన్ అవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. కాగా, స్పెల్ బీ 2022లో గెలిచిన హరిణికి నిర్వాహకులు 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ చెక్కును అందజేశారు.