Belgium: ఆ దేశంలో ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులే పని.. కండిషన్స్ అప్లై..

Belgium: సాధారణంగా ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన కార్మిక చట్టాలు మెరుగుపరుస్తూ ఇందుకు సంబంధించిన పలు నిర్ణయాలను గత కొన్నేళ్లుగా చాలా దేశాలు అమలు చేస్తున్నాయి.

Belgium: ఆ దేశంలో  ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులే పని.. కండిషన్స్ అప్లై..
Belgium Allows Four Day Wee
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2022 | 3:20 PM

Belgium: సాధారణంగా ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన కార్మిక చట్టాలు మెరుగుపరుస్తూ ఇందుకు సంబంధించిన పలు నిర్ణయాలను గత కొన్నేళ్లుగా చాలా దేశాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా వారానికి నాలుగు రోజుల పనిని అమలు చేసిన దేశాలుగా స్పెయిన్(Spain), ఐస్‌లాండ్ ( Iceland) , జపాన్( Japan)  నిలిచాయి. అయితే నిజానికి వారంలో 4రోజులు వర్కింగ్ డేస్ ని గత ఏడాది డిసెంబర్‌లోనే యూఏఈ ప్రయోగాత్మకంగా అమలు చేసి.. మొదటి దేశంగా  అవతరించింది. తాజాగా ఈ దేశాల జాబితాలో బెల్జియం కూడా చేరింది. తన ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు పని చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు కార్మిక సంఘాలు, వ్యాపారసంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.  బెల్జియంలో చాలా కాలంగా  కార్మిక చట్టాల సంస్కరణల కోసం స్వరం వినిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు, వ్యాపార సంస్థల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. తాజాగా ఆ దేశ ప్రధాని అలెగ్జాండర్‌ డి క్రూ.. వారానికి నాలుగు రోజుల పనిని అమల్లోకి తీసుకురానున్నామని ప్రకటించారు. అంతేకాదు వర్కింగ్ అవర్స్‌ ముగిసిన తర్వాత ఆ ఉద్యోగి ఆఫీస్‌ పని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డి క్రూ.. కోవిడ్-19 మహమ్మారి గురించి ప్రస్తావిస్తూ.. గత రెండేళ్లు  కష్టతరమైన పరిస్థితులను చూశామని చెప్పారు. కరోనా మహమ్మారి దృష్ట్యా పరిస్థితులకు అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. వినూత్నమైన, స్థిరమైన ,డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దారి చూపామని.. . ప్రజల జీవన నాణ్యతను మెరుగుపర్చడంతో పాటు ఉత్తమమైన వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ను అందించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని తెలిపారు.  లేబర్‌ మార్కెట్‌ కూడా ఈ విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.

నాలుగు రోజుల్లో 38గంటలు పని:

బెల్జియన్ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి , జీవిత సమతుల్యతను అందించడానికి ఇప్పుడు తీసుకున్న కొత్త నిర్ణయం ఉపయోగ పడుతుందని  ప్రభుత్వం భావిస్తోంది. ఇక నుంచి ఉద్యోగులు ఐదు రోజులు కాకుండా, నాలుగు రోజులు పని చేయాల్సి ఉంటుంది. వారంలో మొత్తం 38 గంటలు పనిచేయాలి.. అంటే రోజుకు 9.30 గంటలు విధులు నిర్వహించాలి. నాలుగు రోజుల్లో ఎక్కువ గంటలు పనిచేసినప్పటికీ.. వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో వచ్చే వారానికి ఉద్యోగులు ఉత్సాహంగా ఆఫీసులకు వస్తారని బెల్జియం ప్రభుత్వం భావిస్తోంది.

ఉద్యోగులు యాజమాన్యం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది

అయితే ఇలా వారంలో నాలుగు రోజులు పని చేయాలంటే యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాలి. ఉద్యోగి దీనికి సంబంధించిన కారణాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలి. అంతేకాదు రాత్రిపూట పనిలో కూడా మార్పులను కొత్త కార్మిక చట్టాల్లో ప్రతిపాదించారు. కొత్త నిబంధనల ప్రకారం, రాత్రిపూట వేతనం రేటు ప్రస్తుతం 8 గంటల కట్-ఆఫ్‌కు బదులుగా అర్ధరాత్రి తర్వాత మాత్రమే వర్తిస్తుంది.

ఎప్పుడు అమల్లోకి వస్తుంటే: 

ఈ కొత్త విధానం ఇప్పుడే అమల్లోకి రాదట. ప్రస్తుతానికి దీనిపై ముసాయిదా బిల్లును రూపొందించారు. దీనిపై ప్రజల, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు సేకరించిన తర్వాత తుది బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మిడిల్ లో ఈ కొత్త పనిదినాలు అమలులోకి తీసుకుని రానున్నట్లు తెలుస్తోంది.

Also Read:

ఊరు మొత్తానికి ఏ గ్రేడ్ చేపలు దానం చేసిన సర్పంచ్.. రీజన్ తెలిస్తే గ్రేట్ అంటారు

 శరవేగంగా ‘గాడ్ ఫాదర్’ షూటింగ్.. షెడ్యూల్ కంప్లీట్ చేసిన లేడీ సూపర్ స్టార్