Andhra Pradesh: ఊరు మొత్తానికి ఏ గ్రేడ్ చేపలు దానం చేసిన సర్పంచ్.. రీజన్ తెలిస్తే గ్రేట్ అంటారు

అన్నదానం, వస్త్రదానం ఇది కామన్‌. మరి, మీరెప్పుడైనా చేపదానం విన్నారా? ఊరు ఊరంతా కలిసి ఫిష్‌ ఫెస్టివల్‌ చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? అది కూడా ఆర్గానిక్‌ చేపలను? ఈ వెరైటీ ఫిష్ ఫెస్టివల్‌ ఎక్కడ జరిగిందో? ఆ కథేంటో?

Andhra Pradesh: ఊరు మొత్తానికి ఏ గ్రేడ్ చేపలు దానం చేసిన సర్పంచ్.. రీజన్ తెలిస్తే గ్రేట్ అంటారు
Fish Donation
Follow us

|

Updated on: Feb 17, 2022 | 3:49 PM

West Godavari District:అన్నదానం చూసుంటారు, వస్త్రదానం చూసుంటారు, భూదానం, గోదానం వినుంటారుమరి, చేపదానం ఎప్పుడైనా విన్నారా? అస్సలు, వినే ఉండరు. అయితే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.  పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల(Dwaraka Tirumala) మండలం గొల్లగూడెం గ్రామంలో చేపల పండగ(Fish Festival) జరిగింది. గ్రామంలో ఎన్ని ఇళ్లుంటే, అన్ని ఇళ్లల్లోనూ చేపల పులుసు, ఫిష్‌ ఫ్రై ఘుమఘుమలే కనిపించాయ్. గ్రామంలో ఫిష్ ఫెస్టివల్‌ ఏంటని విస్తుపోకండి. దీని వెనక ఓ కథుంది. గ్రామ సర్పంచ్‌ బొండాడ నాగభూషణం ఊర్లోని ప్రతి కుటుంబానికి చేపల దానం చేశారు. ఊరంతా ఇంటింటికెళ్లి మరీ చేపలు అందజేశారు. బయటవాళ్లకి లీజులిస్తే చెరువును పాడుచేస్తూ, గ్రామస్తులకు హాని చేస్తున్నారని భావించిన సర్పంచ్‌ నాగభూషణం, ఆయనే లీజు డబ్బు చెల్లించి, సహజసిద్ధంగా చేపలను పెంచి, వాటిని గ్రామస్తులందరికీ పంచిపెట్టారు. ఆలోచన మంచిదైతే ఆచరణ కలిసొస్తుందంటారు. అందుకే, సర్పంచ్‌ నాగభూషణంకు ప్రకృతి కూడా సహకరించింది. చేపలన్నీ మంచి సైజులో పెరిగాయి. శీలావతి, కట్ల, రూప్‌చంద్‌, బొచ్చ వంటివి చూస్తుంటే ముద్దొచ్చేలా కనిపించాయ్.

గ్రామ సర్పంచ్‌ స్వయంగా ఇంటికొచ్చి, మంచిమంచి చేపలను దానం చేయడంతో గ్రామస్తులు సంబరపడిపోయారు. గంగమ్మ ఇచ్చిన దానంగా స్వీకరించి, ఫిష్ ఫెస్టివల్‌ జరుపుకున్నారు. సాధారణంగా ఎవరైనా, అమ్మకానికి పనికిరాని చేపలనో, లేక చచ్చినవాటినో ఫ్రీగా ఇస్తుంటారు. కానీ, సర్పంచ్‌ నాగభూషణం, మంచిమంచి చేపలను ఉచితంగా ఇవ్వడంతో చేపల పులుసు, ఫిష్‌ ఫ్రై చేసుకుని పండగ చేసుకున్నారు గొల్లగూడెం గ్రామస్తులు. ఈ వార్త చదివాక, మీక్కూడా నోరూరుతోంది కదా? మనక్కుడా ఎవరైనా చేపల దానం చేస్తే బాగుణ్ణు అనుకుంటున్నారా? మీరే కాదు, గొల్లగూడెం చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అలాగే అనుకుంటున్నారట. మాక్కూడా చేపల దానం కావాలని అడుగుతున్నారట. ఇదండీ చేపల దానం కథ.

Also Read: కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు

అపరంజి బొమ్మ.. అందాల జాబిల్లి.. అప్పట్లో తెలుగునాట సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?