Bangladesh PM: టైమ్ కవర్ పేజీపై షేక్ హసీనా.. 2024 ఎన్నికలపై బంగ్లా ప్రధాని కీలక వ్యాఖ్యలు
2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హసీనా టైమ్ మ్యాగ్జిన్ అనే అమెరికన్ పత్రికకు ఒక ఇంటర్వూ ఇచ్చారు. అందులో "నా ప్రజలు నాతో ఉన్నారని నాకు నమ్మకం ఉంది. వారే నా బలం. ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా నన్ను పడగొట్టడం అంత సులభం కాదు. నన్ను అంతమొందించడమే ఏకైక మార్గం అయితే నా ప్రజల కోసం నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను." ఈ ఆసక్తికర విషయాలను ఒక పత్రికా ఇంటర్వూలో ప్రధానమంత్రి హసీనా అన్నారు. "76 ఏళ్ళ వయసులో, బంగ్లాదేశ్ ప్రధాన
2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హసీనా టైమ్ మ్యాగ్జిన్ అనే అమెరికన్ పత్రికకు ఒక ఇంటర్వూ ఇచ్చారు. అందులో “నా ప్రజలు నాతో ఉన్నారని నాకు నమ్మకం ఉంది. వారే నా బలం. ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా నన్ను పడగొట్టడం అంత సులభం కాదు. నన్ను అంతమొందించడమే ఏకైక మార్గం అయితే నా ప్రజల కోసం నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను.” ఈ ఆసక్తికర విషయాలను ఒక పత్రికా ఇంటర్వూలో ప్రధానమంత్రి హసీనా అన్నారు. “76 ఏళ్ళ వయసులో, బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా గడిచిన దశాబ్దంలో గ్రామీణ జనపనార ఉత్పత్తిదారులను అభివృద్ది చేసి ఆసియా-పసిఫిక్ మధ్య ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేసినట్లు తెలిపారు. 170 మిలియన్ల సంపదను సృష్టించేందుకు పూనుకున్నట్లు వెల్లడించారు.
1996 నుండి 2001 వరకు ఆ తరువాత 2009 దాకా ఆమె ప్రపంచంలోనే ఎక్కువ కాలం పనిచేసిన మహిళా ప్రభుత్వాధినేతగా రికార్డు సృష్టించారు. అలాగే ఇస్లామిస్ట్‌లను, ఒకప్పుడు మధ్యవర్తిత్వం వహించిన మిలిటరీని లొంగదీసుకున్న ఘనత తమ ప్రభుత్వానిదే అని సంచలన విషయాలను వెల్లడించారు. “ఇప్పటికే మార్గరెట్ థాచర్, ఇందిరా గాంధీ కంటే ఎక్కువ సార్లు ఎన్నికల్లో గెలిచిన హసీనా మరోసారి అధికారాన్ని అధిరోహించాలని నిశ్చయించుకుంది” అని ప్రముఖ పత్రికా సంపాదకులు తెలిపారు. “గత కొన్ని సంవత్సరాలుగా హసీనా ఎదుర్కొన్న 19 హత్యాప్రయత్నాలలో కొన్ని ఖండించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈమధ్య కాలంలో, తమకు మద్దతుదారులైన ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) భద్రతా దళాలతో ఘర్షణకు దారితీసింది. వందలాది మంది అరెస్ట్ కాగా ఈ ఘర్షణలో పోలీసు వాహనాలు, పబ్లిక్ బస్సులు తగులబెట్టబడ్డాయని తెలిపారు. ఈ మారణకాండలో అనేక మంది మరణించారు. 2014, 2018 సంవత్సరాల్లో హసీనా పోటీ చేయని పక్షంలో రెండు ఎన్నికల్లోనూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని బహిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు 2025 వరకు ఏటా 100 బిలియన్ డాలర్లు అందించాలని డిమాండ్ చేయడం గురించి ఆమె పట్టుబట్టడ్డారు. కానీ అది ఇప్పటివరకు నెరవేరలేదని షేక్ హసీనా అన్నారు, ” మేము వాగ్దానాలను మాత్రమే స్వీకరించాలని కోరుకోవడం లేదు – అభివృద్ధిని కూడా కాంక్షిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు నెరవేరని హామీలను, షేక్ హసీనా పంచుకున్నారు.
ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక బ్యాలెట్ బాక్సులను, గుర్తింపు కార్డులు, బయోమెట్రిక్ డేటాతో అనుసంధానించబడిన రిజిస్ట్రేషన్ పత్రాల గురించి కూడా ఆమె మాట్లాడారు. “ఇది మా పోరాటం – ఓటు హక్కు, ఆహారం హక్కు. అది మా నినాదం” అని అంతరంగాన్ని ఆవిష్కరించారు. బంగ్లాదేశ్ ఎందుకు గ్రే జోన్‌లో ఉంది అనే దానిపై హసీనా ఇలా స్పందించారు. “ప్రజాస్వామ్యానికి భిన్నమైన నిర్వచనం ఉంది, అది దేశానికి దేశానికి మారుతూ ఉంటుంది”.
TIME’s new cover: Under Prime Minister Sheikh Hasina, democracy in Bangladesh hangs in the balance https://t.co/355ojZW1j1 pic.twitter.com/POMi7oRKD0
— TIME (@TIME) November 2, 2023
“షేక్ హసీనా అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ బంగ్లాదేశ్” అనే మ్యాగజైన్‌లో హసీనా కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించారు. గత రెండు ఎన్నికలను అమెరికాతో పాటూ యూరోపియన్ యూనియన్‌లు కొన్ని అక్రమాలను ఖండించాయి. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు సంజీవ్ సన్యాల్, తన ట్విటర్ వేదికగా స్పందించారు. “ఈరోజు, రెండుసార్లు మాజీ ప్రధాని బాంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ నాయకురాలు ఖలీదా జియా, అనుమానాస్పద, అవినీతి ఆరోపణలతో పాటూ తీవ్ర అనారోగ్యంతో గృహనిర్బంధంలో ఉన్నారు. అయితే స్వతంత్ర పాత్రికేయులతోపాటూ పౌర సమాజం కూడా ప్రతీకారం తీర్చుకున్నట్లు చెప్పారు. ఈ సంఘటనలు అన్నీ వచ్చే జనవరి ఎన్నికల పట్టాభిషేకానికి సమానమని, హసీనా నియంతృత్వ పోకడలకు సమానమని విమర్శకులు అంటున్నారు” అంటూ ఒక పత్రిక ప్రచురించినట్లు తెలిపారు.