AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాజా ఆసుపత్రి, అంబులెన్స్‌పై ఇజ్రాయిల్ దాడి.. 15 మంది మృతి, ఉగ్రవాదులు, ఆయుధాలు దాస్తున్నారని ఆరోపణ

హమాస్ తన ఉగ్రవాదులను, ఆయుధాలను అంబులెన్స్‌ ద్వారా తరలిస్తోందని.. అందుకే దానిని గుర్తించి లక్ష్యంగా చేసుకుంటున్నట్లు IDF తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం చేసిన ఈ ఆరోపణ నిరాధారమని హమాస్ పేర్కొంది. అంబులెన్స్‌లను ఉగ్రవాద యోధులు ఉపయోగిస్తున్న ఆరోపణలను  హమాస్ అల్-షిఫా ఆసుపత్రి అధికారులు ఖండించారు.

గాజా ఆసుపత్రి, అంబులెన్స్‌పై ఇజ్రాయిల్ దాడి.. 15 మంది మృతి, ఉగ్రవాదులు, ఆయుధాలు దాస్తున్నారని ఆరోపణ
Israel Hamas War
Surya Kala
|

Updated on: Nov 04, 2023 | 8:31 AM

Share

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల నిర్ములనే లక్ష్యంగా నిరంతరం గాజాపై బాంబులతో దాడి చేస్తోంది.    తాజాగా గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో 15 మంది మరణించగా 60 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యం మొదట ఆసుపత్రిపై బాంబు దాడి చేసి అనంతరం అంబులెన్స్ సమీపంలో దాడి చేసింది. హమాస్ తమ యోధుల కోసం అంబులెన్స్‌లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అంబులెన్స్‌ను గుర్తించిన తర్వాత దానిపై దాడి చేశారు. ఈ దాడిలో హమాస్ యోధులు మరణించారని ఐడీఎఫ్ తెలిపింది.

అంతేకాదు హమాస్ తన ఉగ్రవాదులను, ఆయుధాలను అంబులెన్స్‌ ద్వారా తరలిస్తోందని.. అందుకే దానిని గుర్తించి లక్ష్యంగా చేసుకుంటున్నట్లు IDF తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం చేసిన ఈ ఆరోపణ నిరాధారమని హమాస్ పేర్కొంది. అంబులెన్స్‌లను ఉగ్రవాద యోధులు ఉపయోగిస్తున్న ఆరోపణలను  హమాస్ అల్-షిఫా ఆసుపత్రి అధికారులు ఖండించారు. అయితే అంబులెన్స్‌లను హమాస్ యోధులు ఉపయోగిస్తున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి ఆధారాలు అందించలేదు.

గతంలో కూడా ఆసుపత్రిపై దాడి ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ సైన్యం మాట్లాడుతూ, ఇది యుద్ధ ప్రాంతం అని మేము పదేపదే చెబుతున్నాము. ఇక్కడి పౌరులు తమ భద్రత కోసం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని పదే పదే కోరుతున్నారు. ఇంతకుముందు ఇజ్రాయెల్ గాజాలోని ఆసుపత్రిపై దాడి చేయగా.. 500 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

హమాస్‌పై యుద్ధం కొనసాగుతుంది – నెతన్యాహు

హమాస్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. గాజాలోకి ఇంధన ప్రవేశంపై నిషేధం గురించి మాట్లాడామని ఆయన అన్నారు. అతను గాజాలో కాల్పుల విరమణను సున్నితంగా తిరస్కరించారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసే వరకు యుద్ధాన్ని ఆపడానికి తాను అంగీకరించబోనని నెతన్యాహు చెప్పారు. గాజాకు ఇంధనం, డబ్బు పంపడాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తుందని ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో నెతన్యాహు చెప్పారు.

గాజాలో ఇప్పటివరకు 9000 మందికి పైగా మృతి

ఇజ్రాయెల్ .. హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు అవుతుంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడిలో గాజాలో 9000 మందికి పైగా మరణించారు. 32000 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడిలో 3700 మందికి పైగా పిల్లలు మరణించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు గాజాలో నేల మీద దాడిని ప్రారంభించింది. నిరంతరం దాడి చేస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే