ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు, కారుకు కారే కొట్టుకుపోయింది
ఆస్ట్రేలియాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. దేశంలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి.
ఆస్ట్రేలియాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. దేశంలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లలో నీటి ఉధృతి కారణంగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ కారణంగా దయచేసి ఎవరూ బయటకు రాకూడదని స్వయంగా ప్రధాని స్కాట్ మారిసన్ కోరుతూ ట్వీట్ చేశారు. పైగా ఈ వరదల్లో కొట్టుకుపోతున్న ఓ కారు తాలూకు వీడియోను ఆయన షేర్ చేశారు. అదృష్టవశాత్తూ ఈ వాహన డ్రైవర్ ముందే ఈ కారు నుంచి బయటపడ్డాడు. నీటి ప్రవాహానికి ఆ వాహనం ఓ బొమ్మ కారులా కొట్టుకుపోయింది. ముఖ్యంగా క్వీన్స్ ల్యాండ్ వాసులను… ‘ ప్లీజ్..వెనక్కి వెళ్లాలని’ స్థానిక అధికారులు కూడా హెచ్చరించారు. న్యూసౌత్ వేల్స్ లో 18 వేల మందికి పైగా ప్రజలను ప్రభుత్వం సురక్షిత స్థలాలకు తరలించింది.
రెండు మూడు రోజులుగా ఈ దేశంలో కురుస్తున్న వర్షాలకు పంటలు కూడా నాశనమయ్యాయి.
This is why you should never go into flood waters. If it’s flooded, forget it.
Thankfully, this driver was able to get out safely before the car was swept away. https://t.co/slQpUvQMFr
— Scott Morrison (@ScottMorrisonMP) March 23, 2021
మరిన్ని ఇక్కడ చదవండి: Tirupati By-Election: తిరుపతి ఉప ఎన్నిక.. అధికార, ప్రతిపక్షంలోని ఆ నాయకులకు అగ్ని పరీక్ష..
AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో ఒంటి పూట బడులు, వేసవి సెలవులు… పూర్తి షెడ్యూల్ ఇదే…