Australia Floods: క్వీన్‌ల్యాండ్స్‌ను మళ్లీ ముంచెత్తిన భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
Australia Rains: ఆస్ట్రేలియా క్వీన్‌ల్యాండ్స్ కకావికలమైపోయింది. ఎడతెరిపిలేని వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని
Australia Rains: ఆస్ట్రేలియా క్వీన్‌ల్యాండ్స్ కకావికలమైపోయింది. ఎడతెరిపిలేని వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని విక్టోరియా స్టేట్‌కు మార్చి నెల శాపంగా మారింది. ఈ నెలలో వరుసగా రెండోసారి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి.. ఎక్కడ చూసినా వేగంగా కదులుతున్న వరద నీరే కనిపించింది.. ఈ వరదల్లో రోడ్లు, వంతెనలు, ఇళ్లు, వాహనాలు మునిగిపోయాయి. అనేక చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి.. రోడ్ల మీద నిలిపిఉన్న వాహనాలు వరద నీటిలో గల్లంతైపోయాయి. క్వీన్ లాండ్ స్టేట్ అంతటా బీభత్సంగా వర్షాలు పడ్డాయి. సిడ్నీ నగరంలతో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జలాశయాలను ముంచెత్తిన వరద నీరు నివాస ప్రాంతాలను చుట్టేయడంతో వేల సంఖ్యలో జనం ఇళ్లు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని స్థానికులు వాపోతున్నారు. నష్టం భారీగానే ఉంటుందని ఆంచనా వేస్తున్నారు. రోడ్లను వరద నీరు ముంచెత్తడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ప్రయాణాలు నిలిచిపోయాయి స్థానిక పాలనా యంత్రాంగం సహాయక కార్యక్రమాలను చేపట్టింది.
వరదల్లో చిక్కుకొని ఇప్పటి వరకూ ఇద్దరు మరణించారు.. ఓ వ్యక్తి వాహనం వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. మార్చి మాసంలో వరుసగా కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా క్వీన్‌లాండ్, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ 21 మంది చనిపోయారు. వరదల్లో దెబ్బతిన్న తన ఇళ్లు, పొలాను చక్కదిద్దుకునేలోపు మరోసారి ప్రకృతి దెబ్బ తీయడంతో తిరిగి కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.. మరోవైపు రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Also Read: