WHO: కేసులు తగ్గినా మరణాలు పెరిగాయి.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన.. కారణమిదే

మరణాల నమోదు ప్రక్రియలో సవరణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా(Corona) మరణాల సంఖ్య పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. గతవారం కొవిడ్‌ మరణాల సంఖ్య 40 శాతానికి పైగా పెరిగిందని తెలిపింది. అమెరికా...

WHO: కేసులు తగ్గినా మరణాలు పెరిగాయి.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన.. కారణమిదే
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 30, 2022 | 8:46 PM

మరణాల నమోదు ప్రక్రియలో సవరణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా(Corona) మరణాల సంఖ్య పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. గతవారం కొవిడ్‌ మరణాల సంఖ్య 40 శాతానికి పైగా పెరిగిందని తెలిపింది. అమెరికా(America)లో మరణాల నమోదు, భారత్‌ వంటి దేశాల్లో లెక్కల్లో సవరణ కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్లు పేర్కొంది. అంతేకాకుండా కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నాయని వివరించింది. చాలా దేశాలు కరోనా నిబంధనలను ఎత్తివేయడంతో పాటు పరీక్షలను కూడా తగ్గించినందున ఈ గణాంకాలతో వైరస్‌ అంతమవుతుందని అంచనాకు రాలేమని డబ్ల్యాహెచ్ఓ అభిప్రాయ పడింది. అందువల్ల వైరస్‌ వ్యాప్తి ఎలా ఉందనేది కచ్చితంగా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో వైరస్‌ను తక్కువగా అంచనా వేయొద్దని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

గత వారం ప్రపంచవ్యాప్తంగా 45వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతక్రితం వారం మరణాల సంఖ్య 23 శాతం తగ్గాయి. గతవారం మాత్రం 40 శాతం పెరగింది. భారత్‌లో కొన్ని రాష్ట్రాలు ఇటీవల మరణాల సంఖ్యను సవరించాయి. ఈ నేపథ్యంలోనే మరణాల సంఖ్య పెరిగింది. గతవారం దాదాపు 10 మిలియన్ల కొత్త కేసులు నమోదయ్యాయి.

                    – ప్రపంచ ఆరోగ్య సంస్థ

మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. కొత్తగా 1,200కు పైగా కేసులు మాత్రమే నమోదవడం ఊరట కలిగిస్తోంది. వైరస్ కారణంగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,876 మంది వైరస్​ను జయించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.20శాతంగా ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకాల సంఖ్య 183,82,41,743 కు చేరింది. రోజూవారీ కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read

Combat Helicopter: మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్మీకి 15 లైట్ కంబాట్ హెలికాప్టర్లు.. ధర ఎంతో తెలుసా?

World Record Tea Party: గిన్నిస్‌ రికార్డులకెక్కిన టీ పార్టీ… స్పెషల్‌ ఏంటో తెలిస్తే నోరు వెళ్లబెడతారు..

Fuel Crisis: పెనం నుంచి పొయ్యిలోకి.. ఇకపై ఆ దేశంలో ప్రతిరోజు 10 గంటలు కరెంట్ కట్