Russia Ukraine Crisis: సురక్షితంగా భూమికి చేరిన అమెరికా, రష్యా వ్యోమగాములు.. ఒకే వ్యోమనౌకలో.. 

NASA Astronauts Returned: ఉక్రెయిన్‌ యుద్ధం ఇరు దేశాల మధ్య చిచ్చు పెట్టినా అంతరిక్షంలో మాత్రం కలిసే పని చేస్తున్నాయి. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి

Russia Ukraine Crisis: సురక్షితంగా భూమికి చేరిన అమెరికా, రష్యా వ్యోమగాములు.. ఒకే వ్యోమనౌకలో.. 
Astronauts
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 31, 2022 | 5:59 AM

NASA Astronauts Returned: ఉక్రెయిన్‌ యుద్ధం ఇరు దేశాల మధ్య చిచ్చు పెట్టినా అంతరిక్షంలో మాత్రం కలిసే పని చేస్తున్నాయి. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి అమెరికన్‌, ఇద్దరు రష్యన్‌ వ్యోమగాములు ఒకే క్యాప్యూల్‌లో భూమిపైకి సురక్షితంగా దిగారు. యుద్ధ పరిణామాలు వారి వారి మధ్య ఎలాంటి విబేధాలను కలిగించలేదు. ఉక్రెయిన్‌ యుద్ధం అమెరికా, రష్యా సంబంధాలపై గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో చిచ్చు పెట్టింది. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా అనేక ఆంక్షలను విధించింది. అటు బైడెన్‌, ఇటు పుతిన్‌ పరిధిని దాటి మరీ నిందించుకున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన వ్యోమగాములు ఒకే వ్యోమనౌకలో భూమికి చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌-ISS నుంచి ముగ్గురు వ్యోమగాములు కజకిస్తాన్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారు. ఇందులో ఒకరు అమెరికన్‌ కాగా, ఇద్దరు రష్యన్లు ఉన్నారు.

అమెరికాకు చెందిన మార్క్‌ వాండేహె, రష్యాకు చెందిన ఆంటోన్‌ ష్కప్లెరోవ్‌, ప్యోర్ట్‌ దుబ్రోవ్‌ ఒకే క్యాప్యూల్‌లో భూమి మీదకు వచ్చారు.. అంతరిక్ష వాతావరణం నుంచి భూ వాతావరణంలోకి మారే క్రమంలో వీరికి సాంకేతిక, వైద్య సిబ్బంది ఈ ముగ్గురు వ్యోమగాములకు సాయపడ్డారు.. నాసాకు చెందిన వ్యోమగామి మార్క్‌ వాండేహె రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లాడు.. మొదటి సారి 340 రోజులు ISSలో గడిపాడు. రెండోసారి ఏకంగా 355 రోజలు ఉండి సరికొత్త రికార్డు నెలకొల్పాడు మార్క్‌ వాండేహె..

ఈ ముగ్గురు వ్యోగగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు భూమి మీద జరుగుతున్న ఘటనలన్నీ తెలుసు.. ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌ ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బ తీసినా, వీరు మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా కలిసి పనిచేస్తున్నారు. రష్యన్ వ్యోమగాములు భూమి మీదకు దిగే సమయంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశ జెండా రంగు పసుపు, నీలం ప్రదర్శిస్తారని ఊహాగానాలు వినిపించినా, అక్కడ అలాంటిదేమీ కనపించలేదు. ఆప్యాయంగా కరచాలనాలు, కౌగిలింతల స్వాగతం మాత్రమే కనిపించింది.

రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ కజఖ్ స్టెప్పీ ఈ వ్యోమగాములు భూమిపైకి వచ్చే సన్నివేశాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసింది.

Also Read:

Pakistan Crisis: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తారా.. మరికాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగం!

Terror Attack: 7 రోజుల్లో మూడో ఉగ్రవాద దాడి.. ఇజ్రాయెల్‌ కాల్పుల్లో పోలీసు ఐదుగురు మృతి