సంచలనం.. 16 ఏళ్లలోపు పిల్లకు సోషల్ మీడియా నిషేధం.. రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానా ఎవరికో తెలుసా..?
ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించింది. ప్రపంచంలోనే తొలిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేసిన దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇవ్వాల్టి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించింది. ప్రపంచంలోనే తొలిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేసిన దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ కొత్త, కఠిన నిబంధనలు బుధవారం (డిసెంబర్ 10, 2025) నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ సంస్కరణ ద్వారా పిల్లలకు వారి బాల్యం పోకుండా చూడచ్చని ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ పేర్కొన్నారు. సోషల్ మీడియోపై నిషేధాన్ని విధించడం ద్వారా తల్లిదండ్రులకు మరింత భరోసా ఇవ్వవచ్చని ఆస్ట్రేలియా పీఎం ఆంటోనీ అల్బనీస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది కుటుంబాలకు “గర్వించదగ్గ రోజు” అంటూ ప్రధాని అభివర్ణించారు.. సాంప్రదాయ రక్షణలను అధిగమించిన ఆన్‌లైన్ హానిని విధాన నిర్ణేతలు అరికట్టగలరని ఈ సోషల్ మీడియా నియంత్రణ చట్టాన్ని రుజువుగా అభివర్ణించారు.. ఈ నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు ఆస్ట్రేలియాలోని పలు రాష్ట్రాల నేతలకు ప్రధాని అల్బనీస్ రాసి.. “ఆస్ట్రేలియాకు అవసరమైన సాంస్కృతిక మార్పు ఇదే” అని ఆయన చదకపరూతపతాకగ.
కాగా.. 2024 నవంబర్‌లో పార్లమెంట్ ఆమోదించిన సోషల్ మీడియో నియంత్రణ చట్టాల ప్రకారం.. 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు ఖాతాలు కలిగి ఉండకుండా నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ సహా మొత్తం 10 ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లకు ఈ ఆదేశాలు జారీ అయినట్లు అధికారులు తెలిపారు.
ఈ చట్టంలోని కీలక అంశం ఏమిటంటే.. నిషేధాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా సోషల్ మీడియా సంస్థలదే.. ఒకవేళ పిల్లలు నిబంధనలు ఉల్లంఘించినా, వారికి గానీ వారి తల్లిదండ్రులకు గానీ.. ఎలాంటి శిక్షలు ఉండవు.. కొత్త చట్టం ప్రకారం అర్ధరాత్రి (మంగళవారం GMT 1300) నుంచి పిల్లల ఖాతాలను బ్లాక్ చేయాలని లేదా A$49.5 మిలియన్ల ($33 మిలియన్లు) వరకు జరిమానా విధిస్తామని పది అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌లకు వార్నింగ్ ఇచ్చారు. ఇది ప్రధాన సాంకేతిక సంస్థలు, వాక్ స్వాతంత్య్ర న్యాయవాదుల నుండి విమర్శలను ఎదుర్కొంది, అయితే తల్లిదండ్రులు – పిల్లల న్యాయవాదులు దీనిని స్వాగతించారు.
సోషల్ మీడియాలోని కొన్ని డిజైన్లు.. అనుసరిస్తున్న విధానాలు యువతను స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా ప్రోత్సహిస్తున్నాయని, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 2025లో ప్రభుత్వం జరిపిన ఒక అధ్యయనంలో, 10-15 ఏళ్ల వయసున్న పిల్లల్లో 96 శాతం మంది సోషల్ మీడియా వాడుతున్నారని తెలిసింది.. వారిలో 70 శాతం మంది హింస, ఆత్మహత్యలను ప్రోత్సహించే కంటెంట్ వంటి హానికరమైన విషయాలను చూస్తున్నారని తెలింది.. ఈ హానికరమైన ప్రభావాలను తగ్గించడమే ఈ నిషేధం ముఖ్య ఉద్దేశమని ఆస్ట్రేలియా ప్రభుత్వం వివరించింది.
అయితే.. డెన్మార్క్ నుండి న్యూజిలాండ్, మలేషియా వరకు అనేక దేశాలు ఆస్ట్రేలియా నమూనాను అధ్యయనం చేయవచ్చని లేదా అనుకరించవచ్చని సంకేతాలు ఇచ్చాయి.. ప్రభుత్వాలు లేదా ఆవిష్కరణలను అణచివేయకుండా వయస్సు-పరిమితిని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలవో అనే విషయాలను ఆ దేశం ఉదహరణగా నిలవనుంది.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
