అన్నదొక దారి.. తమ్ముడిది మరో దారి.. తాలిబన్లకు మద్దతు ప్రకటించిన అష్రాఫ్ ఘని సోదరుడు హష్మత్ ఘని

ఆఫ్ఘన్ క్రైసిస్ లో ఓ మలుపు.. తాలిబన్ల ఆక్రమణతో బెంబేలెత్తిపోయి.. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా కాబూల్ నుంచి నిష్క్రమించానని చెప్పుకున్న మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని సోదరుడు హష్మత్ ఘని అహమద్ జాయ్.

అన్నదొక దారి.. తమ్ముడిది మరో దారి.. తాలిబన్లకు మద్దతు ప్రకటించిన అష్రాఫ్ ఘని సోదరుడు హష్మత్ ఘని
Ashraf Ghani Brother Support For Talibans
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 21, 2021 | 5:43 PM

ఆఫ్ఘన్ క్రైసిస్ లో ఓ మలుపు.. తాలిబన్ల ఆక్రమణతో బెంబేలెత్తిపోయి.. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా కాబూల్ నుంచి నిష్క్రమించానని చెప్పుకున్న మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని సోదరుడు హష్మత్ ఘని అహమద్ జాయ్..తన మద్దతు తాలిబన్లకేనని ప్రకటించాడు. గ్రాండ్ కౌన్సిల్ ఆఫ్ కుచీస్ చీఫ్ కూడా అయిన ఈయన కాబూల్ లోని ఘని గ్రూప్ చైర్మన్ కూడా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈ గ్రూప్.. బిజినెస్ కార్యకలాపాలు సాగిస్తోంది. తాలిబన్ లీడర్ ఖలీలుర్ రెహమాన్, మత నాయకుడు ముఫ్తీ మహమ్మద్ జకీర్ సమక్షంలో ..ఈయన తన సపోర్ట్ తాలిబన్లకేనని ప్రకటించాడు. జకీర్ ఈ వీడియోను రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ కొత్త పరిణామం ఆఫ్ఘన్ రాజకీయాల్లో..అందులోనూ తాలిబన్ల రాజ్యంలో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలా ఉండగా ఆఫ్ఘన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేసినట్టు ఇస్లామిక్ మూవ్ మెంట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మరి కొన్ని వారాల్లో తాలిబాన్లలోని లీగల్, రెలిజియస్, ఫారిన్ పాలసీ నిపుణులు కొత్త గవర్నింగ్ ఫ్రేమ్ వర్క్ ని రూపొందిస్తారని ఆయన చెప్పారు. అంటే నూతన ప్రభుత్వంలో మతానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పకనే చెప్పారు.

అటు-ఆఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలెహ్ ..ఇక తానే ఆపద్ధర్మ అధ్యక్షుడినని ఇదివరకే ప్రకటించుకున్నారు. దేశాధ్యక్షుడు లేనప్పుడో, పారిపోయినప్పుడో, రాజీనామా చేసినప్పుడు గానీ లేదా మరణించినప్పుడు గానీ ఉపాధ్యక్షుడే ఆపద్ధర్మ అధ్యక్షుడవుతాడని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పంజ్ షిర ప్రావిన్స్ లో ఉన్న ఈయన..తాలిబాన్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ తలవంచే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. ఈయన ఆధ్వర్యంలోని తిరుగుబాటుదారులు ఈ ప్రావిన్స్ సమీపంలోని మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Corona Tests: కరోనా పరీక్షలకు మరో చౌకైన విధానం..పెన్సిల్ ముల్లులోవాడే గ్రాఫైట్ తో కరోనా కనిపెట్టేయొచ్చు.. ఎలా అంటే.. 

Facebook Virtual Reality: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఫేస్‌బుక్‌ మరో అద్భుతం.. హారిజాన్‌ వర్క్‌ రూమ్‌ పేరుతో.