Taliban in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన..?? ఏం జరగనుంది..?? భారత్ పరిస్థితి ఏంటి..??

ఆఫ్గనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన వస్తుందా.. అక్కడి ప్రభుత్వాన్ని వారు కూలదోస్తారా ? కాబూల్ సహా మజారే షరీఫ్ లో గల భారత ఎంబసీ, దౌత్య కార్యాలయాల నుంచి భారత సిబ్బందిని ప్రభుత్వం ఖాళీ చేయించడం చూస్తే పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.

Taliban in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన..?? ఏం జరగనుంది..?? భారత్ పరిస్థితి ఏంటి..??
Taliban In Afghanistan
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 12, 2021 | 5:00 PM

ఆఫ్గనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన వస్తుందా.. అక్కడి ప్రభుత్వాన్ని వారు కూలదోస్తారా ? కాబూల్ సహా మజారే షరీఫ్ లో గల భారత ఎంబసీ, దౌత్య కార్యాలయాల నుంచి భారత సిబ్బందిని ప్రభుత్వం ఖాళీ చేయించడం చూస్తే పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న 50 మంది సిబ్బందిని ప్రభుత్వం అక్కడి నుంచి ఖాళీ చేయించింది. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి జటిలంగా ఉందని ఇండియాలో ఆఫ్ఘన్ రాయబారి అంగీకరించారు కూడా.. ఇక ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే..తాము తలచుకుంటే రెండు వారాల్లో ఆఫ్ఘన్ ను హస్తగతం చేసుకుంటామని లోగడ తాలిబన్ నేత షహాబుద్దీన్ హెచ్చరించాడు. దాదాపు 20 ఏళ్ళ పాటు వార్ సాగింది. ఈ దేశం నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. దేశంలోని సుమారు 85 శాతం భూభాగాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా-తాలిబన్ల విషయానికి వస్తే ఒకప్పుడు వీరి మధ్య పరోక్షంగా వైరం ఉండేది. 2001 సెప్టెంబరు 11 న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఆల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో జరిగిన దాడిలో సుమారు 3 వేలమందికి పైగా అమెరికన్లు మరణించారు,

దాంతో ఆల్ ఖైదాపై యూఎస్ యుద్ధం ప్రకటించింది. అప్పుడు అధికారంలో ఉన్న తాలిబన్ల ఆఫ్గనిస్తాన్ రాడికల్ ఇస్లామిక్ గ్రూప్.. లాడెన్ కి రక్షణ కల్పించింది. కానీ అదే ఏడాది తాలిబన్లు అధికారాన్ని కోల్పోవడంతో పోరు సుదీర్ఘకాలం కొనసాగింది. లాడెన్ ను అమెరికా హతమార్చాక తాలిబన్లపై అమెరికా దూకుడు తగ్గించింది. 2014 తరువాత దాడులను ఆపివేయగా నాటి అధ్యక్షుడు ట్రంప్.. ఆఫ్ఘానిస్తాన్ నుంచి తమ దేశ సైనిక బలగాలను ఉపసంహరిస్తామని ప్రకటించారు. ఆ తరువాత అధ్యక్షుడైన జోబైడెన్ కూడా అదే పంథా అనుసరించారు.

కాపలా విషయానికి వస్తే..

భారత-ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దు 106 కి.మీ. ఉండగా బీఎస్ఎఫ్, భారత ఆర్మీ, అస్సాం రైఫిల్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, కాపలాగా ఉన్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక, మాల్దీవులతో కూడిన సముద్ర జలాల సరిహద్దుల్లో భారత్ ఉంది. ఆఫ్ఘన్ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మునుపటికన్నా ఇప్పుడు ఈ సైన్యం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉగ్రవాదులకు తాలిబన్ల సహకారం

1990 ప్రాంతంలో ఉగ్రవాదుల సంరక్షణ కేంద్రంగా ఆఫ్ఘన్ ఉంటూ వచ్చింది. వారికి నిధులు, ఆశ్రయం, శిక్షణ ఇస్తూ వచ్చింది. నాడు భారత పార్లమెంటుపై దాడికి పాల్పడిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఆఫ్ఘన్ గడ్డపై పుట్టినవే..1999 డిసెంబరు 24 న కాందహార్ విమాన హైజాక్ ఘటనను కూడా ఈ సందర్బంగా ప్రస్తావించుకోవలసి ఉంటుంది.

రష్యా ప్రస్తావన కూడా..

1978-1992 మధ్య ఆఫ్ఘానిస్తాన్ లో కమ్యూనిస్టు పార్టీకి అండగా ఉన్న రష్యా ఆ తరువాత ఆర్థికంగా నష్టపోయి తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. అయినా అమెరికా ఆ దేశ అధిపత్యానికి చెక్ పెట్టింది. ఓ వైపు పాక్ కి సహకరిస్తూ..ఆఫ్ఘన్ కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ముజాహిదీన్ బలగాలకు సాయం చేసింది. ఏమైనా తాలిబన్లను పెంచి పోషించిందన్న ఆరోపణలను ఎదుర్కొంది. తాలిబన్లతో సమస్య ఎదురైతే పాక్ సాయం తీసుకోవచ్చునని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలపై ఇండియా ఐరాసలో ఆందోళన వ్యక్తం చేయడం.. ఐరాస ఆధ్వర్యంలోనే ఆఫ్ఘానిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని కోరడం తెల్సిందే. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ అన్ని పరిణామాలను అంతర్జాతీయ వేదిక వద్ద ప్రస్తావించారు .

మరిన్ని ఇక్కడ చూడండి: Narappa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్‏లోనే వెంకటేష్ “నారప్ప”… విడుదల ఎప్పుడంటే..

YCP vs RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ సస్పెన్షన్‌పై క్లారిటీ ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా.. చర్యలు ఎప్పుడంటే..!