Trump on Modi: “అతను ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకుడు..” ప్రధాని మోదీపై డోనాల్డ్ ట్రంప్ ప్రశంసలు
అమెరికా మాజీ అధ్యక్షుడు, మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. మోదీ తన స్నేహితుడని, ఉత్తమ వ్యక్తిగా కొనియాడారు. ఫ్లాగ్రాంట్ పోడ్‌కాస్ట్‌లో ప్రపంచ నాయకులపై తన అంచనా గురించి ట్రంప్ మాట్లాడుతూ, “నరేంద్ర మోదీ, మంచి స్నేహితుడు, మంచి వ్యక్తి. ప్రధానమంత్రిగా మోదీ నియమితులయ్యే ముందు, భారతదేశం చాలా అస్థిరంగా ఉంది. బయటి నుండి అతను మీలా కనిపిస్తున్నాడు. కానీ, దేశానికి అతను ఉత్తమ తండ్రి వలె.” అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్, 2019 సెప్టెంబరులో టెక్సాస్‌లో జరిగిన ఐకానిక్ “హౌడీ మోదీ” కార్యక్రమాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. హ్యూస్టన్ నగరంలోని NRG స్టేడియంలో పెద్ద సంఖ్యలో భారతీయ-అమెరికన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో హౌడీ, మోదీ అనే కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అది మా హృదయాలను గెలుచుకుందన్నారు ట్రంప్. ఇది సుమారు 80,000 మంది ప్రజలు సమావేశమయ్యారు. అది పిచ్చిగా అనిపించింది. అంతేకాదు నరేంద్ర మోదీతో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల గురించి కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు డోనాల్డ్ ట్రంప్. ప్రధాని మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. క్వాడ్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీని కలుసుకోవాలనుకున్నానని చెప్పారు. కానీ ఈ సమావేశం జరగలేదన్నారు.
ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్‌ను నిజమైన స్నేహితుడు అని పిలుస్తుండగా, మోదీ నాయకత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ట్రంప్ ఈ చర్యకు ప్రతిస్పందించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన “నమస్తే ట్రంప్” కార్యక్రమానికి భారతదేశాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో 1 లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఇది దేశం వెలుపల అమెరికా అధ్యక్షుడు నిర్వహించిన అతిపెద్ద ర్యాలీ కావడం విశేషం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..