Taliban Rule: ఆఫ్ఘానిస్తాన్‌లో విదేశీ కరెన్సీని నిషేధించిన తాలిబాన్లు.. ఎవరు ఉపయోగించొద్దని ఆదేశాలు..
ఇప్పటికే పతనం అంచున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మరింత విఘాతం కలిగించేలా తాలిబాన్లు వ్యవహరిస్తున్నారు. వారి చర్యలతో ఆ దేశం ఆర్థికంగా దిగజారుతోంది. దేశంలో విదేశీ కరెన్సీ వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు...
ఇప్పటికే పతనం అంచున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మరింత విఘాతం కలిగించేలా తాలిబాన్లు వ్యవహరిస్తున్నారు. వారి చర్యలతో ఆ దేశం ఆర్థికంగా దిగజారుతోంది. దేశంలో విదేశీ కరెన్సీ వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. తాలిబాన్ ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. “ఇస్లామిక్ ఎమిరేట్ (తాలిబాన్) పౌరులు, దుకాణదారులు, వ్యాపారులు, వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలందరికీ … ఆఫ్ఘానిస్‌లోనే అన్ని లావాదేవీలు నిర్వహించాలని, విదేశీ కరెన్సీని ఉపయోగించకుండా ఉండాలని ఆదేశించింది” అని తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ చేసిన ప్రకటించారు. “ఈ ఉత్తర్వును ఉల్లంఘించే ఎవరైనా చట్టపరమైన చర్యను ఎదుర్కొంటారు” అని ప్రకటనలో పేర్కొంది.
యూఎస్ డాలర్ ఆఫ్ఘనిస్తాన్ మార్కెట్లలో విస్తృతమైన వాడతారు. సరిహద్దు ప్రాంతాలు పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల కరెన్సీని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆగస్ట్ 15న కాబూల్‌లో తాలిబాన్ స్వాధీనం ఏర్పాడిన తర్వాత యూఎస్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ద్వారా USD 9.5 బిలియన్లకు పైగా ఆఫ్ఘానిస్తాన్ వినియోగించకుండా చేశాయి. తాలిబాను చర్యలతో వేలాది మంది దేశం విడిచిపెట్టారు. ఆఫ్గాన్‌కు అంతర్జాతీయ మద్దతు లేకపోవటంతోసాధారణ ప్రజలకు చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది.
తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఆ దేశంలో హింసా పెరిగిపోతోంది. తాజాగా నిన్న కాబూల్‌లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగి 19 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం జరిగిన పేలుళ్లు ఎవరు చేశారు అనేది తెలియలేదు. ఒక పేలుడు మిలిటరీ ఆసుపత్రి గేట్ వద్ద జరిగింది. అక్టోబర్ 15న కాందహార్‌లోని ఇమాన్ బార్గా మసీదులో మూడు బాంబు పేలుడులు సంభవించాయి. షియా మసీదుపై జరిగిన బాంబు దాడిలో 50 మందికిపైగా మరణించారు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగిన తరువాత జరిగిన ఆ అతిపెద్ద దాడికి తామే కారణమని ఐఎస్-కే ప్రకటించుకుంది.
Read Also.. Taliban Rule: ఇదీ తాలిబన్ల రాక్షసత్వం.. వాలీబాల్ క్రీడాకారిణిని పొట్టనబెట్టుకున్నారు.. ఎందుకంటే..