Afghan Crisis: ఆఫ్ఘన్ దేశంలో తాలిబాన్ నాయకుడిగా పాలన చేపట్టేది ఎవరంటే..

ఆఫ్ఘన్ అధ్యక్ష భవనాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకోవడంతో, ఆఫ్ఘనిస్తాన్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి.

Afghan Crisis: ఆఫ్ఘన్ దేశంలో తాలిబాన్ నాయకుడిగా పాలన చేపట్టేది ఎవరంటే..
Afghan Crisis
Follow us
KVD Varma

|

Updated on: Aug 16, 2021 | 6:20 PM

Afghan Crisis: ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన రాజీనామాను సమర్పించారు.  దేశం విడిచి తజికిస్తాన్ వెళ్లిపోయారు.  తాలిబాన్ కమాండర్లు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసారు. ఆఫ్ఘన్ అధ్యక్ష భవనాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకోవడంతో, ఆఫ్ఘనిస్తాన్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాయకుల జాబితాలో అగ్ర కమాండర్, తాలిబాన్ ఉద్యమ వ్యవస్థాపకులలో ఒకరైన ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ ముందు వరుసలో ఉన్నారు. దాదాపుగా ఆయనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశ పాలనా పగ్గాలు చేపట్టే ఆవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముల్లా బరదార్ గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం..

ముల్లా బరదార్ ఎవరు?

ముల్లా బరదార్ అని పిలువబడే అబ్దుల్ ఘనీ బరదార్ కందహార్‌లో పెరిగారు. ఇది తాలిబాన్ ఉద్యమానికి పుట్టినిల్లు. 1970 ల చివరలో సోవియట్ దండయాత్ర ద్వారా క్లిష్టమైన జీవితాన్ని గడిపిన బరదార్ తిరుగుబాటుదారుడిగా ఎదిగాడు. ఈయన 1980 వ దశకంలో సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధంలో ఒక కన్ను కలిగిన మతాధికారి ముల్లా ఒమర్‌తో పక్కపక్కనే పోరాడాడని చెప్పుకుంటారు.

1990 లలో సోవియట్ యూనియన్ ఈ ప్రాంతం నుండి వైదొలగడంతో కొనసాగుతున్న అంతర్యుద్ధం మధ్య మూళ్ళ ఉమర్ తో కల్సి తాలిబాన్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇక 2001 లో యుఎస్‌లో సెప్టెంబర్ దాడుల తరువాత, తాలిబాన్ పతనం సమయంలో తాలిబాన్ లో ఈయన ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులకు కొత్త నాయకత్వాన్ని అందించాలని.. అప్పటి తాలిబాన్ తాత్కాలిక నాయకుడు హమీద్ కర్జాయ్ పై సాగిన ఒక చిన్న తిరుగుబాటు దారులలో బరదార్ ఉన్నాడని అంటారు.

2010 లో పాకిస్థాన్‌లోని కరాచీ సమీపంలో బరదార్‌ను అరెస్టు చేశారు. 2018 వరకు కస్టడీలో ఉంచారు, ఆ తర్వాత అతడిని ఖతార్‌కు తరలించారు. అక్కడ నుంచి విడుదలైన తరువాత, బరదర్ దోహాలోని తాలిబాన్ల దౌత్య కార్యాలయ చీఫ్‌గా నియమితుడయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా బలగాలను పూర్తిగా తొలగించాలని కోరుతూ అమెరికా ఉపసంహరణ ఒప్పందంపై సంతకం చేయడాన్ని కూడా ఆయన పర్యవేక్షించారు. ముల్లా బరదార్ కాకుండా, హైబతుల్లా అఖుంద్‌జాదా – అత్యున్నత నాయకుడు; సిరాజుద్దీన్ హక్కానీ – హక్కానీ నెట్‌వర్క్; ముల్లా యాకూబ్ – ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ నాయకత్వం కోసం ప్రచారంలో ఉన్నారు.

రాజధాని కాబూల్‌లోని అధ్యక్ష భవనం నుండి ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్‌ను ప్రకటించడానికి సిద్ధమవుతున్నప్పుడు కఠినమైన ఇస్లామిస్ట్ సమూహం ఇప్పుడు అధికారాన్ని తిరిగి పొందేందుకు సిద్ధంగా ఉంది.  సెప్టెంబర్ 11, 2001, దాడుల తర్వాత అమెరికా నేతృత్వంలోని దళాలు తొలగించిన దేశం పేరు ఇది.

తాలిబాన్ సంధానకర్తలు ‘శాంతియుత అధికార మార్పిడి’ అలాగే.. రాబోయే కొద్ది రోజుల్లో ఆఫ్ఘన్ ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్ చేశారు. ఇంతలో, తాలిబాన్లు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించారు. అదే సమయంలో, తాలిబాన్లు ఇప్పుడు కాబూల్ ను పూర్తిగా ఆక్రమించడంతో అక్కడి నివాసితులు తమ వస్తువులను చేతితో పట్టుకుని దేశం విడిచి వెళ్లిపోవడానికి పరుగులు తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో కనిపిస్తున్నాయి.

Also Read: Afghan Crisis: ఆప్ఘాన్ పరిణామాలతో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉందంటే..

Taliban – China: చైనా తోక వంకర.. తాలిబన్ రాక్షసులతో స్నేహం చేస్తామంటూ డ్రాగన్ దేశం ప్రకటన

'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా