AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: పంజ్‌షీర్‌లో తాలిబన్లకు ఎదురుదెబ్బ.. 6 వందల మంది హతం..!

Panjshir vs Talibans: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి అరచకాలు పెట్రేగుతున్నాయి. నిత్యం తాలిబన్లు ప్రజలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రజల పట్ల క్రూర మృగాల్లా

Afghanistan Crisis: పంజ్‌షీర్‌లో తాలిబన్లకు ఎదురుదెబ్బ.. 6 వందల మంది హతం..!
Afghanistan Crisis
Shaik Madar Saheb
|

Updated on: Sep 05, 2021 | 12:48 PM

Share

Panjshir vs Talibans: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి అరచకాలు పెట్రేగుతున్నాయి. నిత్యం తాలిబన్లు ప్రజలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రజల పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆ దేశంలో ఆధిపత్యపోరు నెలకొంది. ఆఫ్ఘన్ ప్రతిఘటన దళాలు, తాలిబన్లకు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లోని పంజ్‌షీర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు నిన్న తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనను పంజ్‌షీర్ తిరుగుబాటు దళం తీవ్రంగా ఖండించింది. తాలిబన్లతో యుద్ధం కొనసాగుతున్నదని పంజ్‌షీర్‌ ఇంకా వారికి లొంగిపోలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు పంజ్‌షీర్ తిరుగుబాటు దళం సంచలన ప్రకటన చేసింది.

ఈ యుద్ధంలో 6 వందలమందికిపైగా తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ దళం ప్రకటించుకుంది. 600 మంది తాలిబన్ ఫైటర్లను పంజ్‌షీర్ యోధులు అంతమొందించారని ప్రకటనలో పేర్కొంది. అలాగే వెయ్యి మందికి పైగా తాలిబన్లు తమకు లొంగిపోయారని తెలిపింది. అయితే.. ఈ ప్రకటన పంజ్‌షీర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీం దష్టి నుంచి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.

అయితే.. ఆఫ్ఘన్‌లోని పంజ్‌షీర్‌పై ఆధిపత్యం సాధించామని తాలిబన్లు ప్రకటించిన మరునాడే.. 6వందల మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్ దళం చేసిన ప్రకటనలతో అంతటా గందరగోళం నెలకొంది. అసలు వాస్తవ పరిస్థితి ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రస్తుతం గందరగోళం ఏర్పడింది. అయితే.. దేశం మొత్తం ఆక్రమించిన తాలిబన్లు.. పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై మాత్రం పైచేయి సాధించలేకపోయారు. ఎందుకంటే.. అక్కడ తాలిబన్లకు వ్యతిరేకంగా దళం పోరాటం చేస్తోంది.

Also Read:

Fuel, Gas Price Hike: దేశంలో పెట్రో ధరలు పెరగడానికి కారణం తాలిబన్లే.. బీజేపీ ఎమ్మెల్యే..

Afghan Crisis: తాలిబన్లు శిక్షించినా.. సంబరాలు చేసుకున్న మారణకాండ తప్పదా.. తుపాకీతో సంబరాలు..17మంది చిన్నారులు మృతి

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ