ఇంటికి పక్కనే ఏర్పడిన భారీ గొయ్యి…..మెక్సికోలో షాకింగ్ ఘటన….స్థానికుల్లో ఆందోళన
సెంట్రల్ మెక్సికోలోని పొలాల్లో దాదాపు 60 మీటర్ల వైశాల్యంతో భారీ గొయ్యి ఏర్పడడంతో స్థానికులంతా అది చూసి షాక్ తిన్నారు. దగ్గర లోని ఓ ఇంటిని కూడా ఇది 'కబళించే' ప్రమాదం ఉందని భయపడుతున్నారు. శాంటామారియా అనే ప్రాంత పొలాల్లో ఇది ఎలా ఏర్పడిందో

సెంట్రల్ మెక్సికోలోని పొలాల్లో దాదాపు 60 మీటర్ల వైశాల్యంతో భారీ గొయ్యి ఏర్పడడంతో స్థానికులంతా అది చూసి షాక్ తిన్నారు. దగ్గర లోని ఓ ఇంటిని కూడా ఇది ‘కబళించే’ ప్రమాదం ఉందని భయపడుతున్నారు. శాంటామారియా అనే ప్రాంత పొలాల్లో ఇది ఎలా ఏర్పడిందో గానీ 20 మీటర్ల లోతు ఉందని గవర్నర్ బార్బోసా తెలిపారు. ఎందుకైనా మంచిదని పక్కనే ఉన్న ఇంటిలోనివారిని ఖాళీ చేయించామన్నారు. మొదట ఇది 5 మీటర్ల వైశాల్యం ఉందని, అయితే కొన్ని గంటల్లోనే పెద్దదిగా మారిపోయిందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతమంతా వ్యవసాయ పనులు జరుగుతున్న కారణంగానూ, భూగర్భ జలాల కోసం తవ్వకాలు జరుపుతున్నందున ఈ గొయ్యి ఏర్పడినట్టు భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందన్న దానిపై జాతీయ జల కమిషన్ వర్గాలు ఆరా తీయనున్నాయి. ఇక్కడి మట్టి విశ్లేషణ, ఇతర అధ్యయనానికి 30 రోజులు పట్టే సూచనలు ఉన్నాయి. పై నున్న భూమి సపోర్టు చేయలేకపోయినప్పుడు.. ఆ భారాన్ని భరించలేక ఈ విధమైన గొయ్యిలు ఏర్పడుతుంటాయని జియాలజీ సర్వే సిబ్బంది అంటున్నారు. ఇదే సమయంలో భూమి లోపలి రాళ్లు క్రమేపీ గట్టిదనం కోల్పోయినప్పుడో , భూగర్భ జలాలు పెల్లుబుకడం వల్లో కూడా ఇలా జరుగుతుందట ..
ఇటలీలో గత జనవరిలో ఏర్పడిన అతి పెద్ద గోతిలో కొన్ని కార్లు పడిపోగా.. దగ్గరలోని ఆసుపత్రిలో కోవిద్ వార్డులోని రోగులను అక్కడినుంచి ఖాళీ చేయించాల్సి వచ్చిందట .. చైనాలో 2020 లో బ్రహ్మాండమైన గోతిలో ఏకంగా బస్సే పడిపోగా ఆరుగురు మరణించారని, 16 మంది గాయపడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : చూస్తుండగానే కుప్పకూలిన హైవే రోడ్డు..కొత్త రోడ్డు ఇలా జరిగితే ఎలా అని నెటిజన్లు కామెంట్స్ : Viral Video.
కలర్ ఫుల్ లెమర్స్ బలే డాన్స్ చేస్తున్నాయ్.యూరప్ లోని చెస్టర్ జూ లో అరుదైన లెమర్స్ : Viral Video