Ramnath Kovind: తుర్క్‌మెనిస్తాన్‌ పర్యటనలో భారత రాష్ట్రపతి కోవింద్ కీలక నిర్ణయం.. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు!

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తుర్క్‌మెనిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడికి చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ శనివారం తుర్క్‌మెన్ అధ్యక్షుడు సెర్దార్ బెర్డిముహమెడోవ్‌తో సమావేశమయ్యారు.

Ramnath Kovind: తుర్క్‌మెనిస్తాన్‌ పర్యటనలో భారత రాష్ట్రపతి కోవింద్ కీలక నిర్ణయం.. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు!
President Ram Nath Kovind Turkmenistan Tour
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 02, 2022 | 4:42 PM

India-Turkmenistan: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ramnath Kovind) తుర్క్‌మెనిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడికి చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ శనివారం తుర్క్‌మెన్ అధ్యక్షుడు సెర్దార్ బెర్డిముహమెడోవ్‌(Serdar Berdimuhamedow)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, తుర్క్‌మెనిస్థాన్‌ అధ్యక్షుడు సర్దార్‌ బెర్దిముహమెడో మధ్య వ్యక్తిగత చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా, భారతదేశం మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశం ఫ్రేమ్‌వర్క్‌తో సహా ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారంపై నాయకులు చర్చించారు. విపత్తు నిర్వహణ, ఆర్థిక మేధస్సు, సంస్కృతి, యువజన వ్యవహారాల్లో సహకారం కోసం భారతదేశం – తుర్క్‌మెనిస్తాన్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు భారత రాష్ట్రపతి కోవింద్ – రాష్ట్రపతి సర్దార్ బెర్డిముహమెదోవ్ సమక్షంలో జరిగాయి.

ఈ సమావేశంలో మా బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు అంగీకరించామని రాష్ట్రపతి కోవింద్ తెలిపారు. మేము వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను కూడా మార్పిడి చేసుకున్నామన్నారు. దీంతో పాటు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్, అష్గాబత్ ఒప్పందానికి సంబంధించిన ప్రాధాన్యతను మేం ఎత్తిచూపామని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ఇరాన్‌లో భారతదేశం నిర్మించిన చబహార్ ఓడరేవు భారతదేశం – ఆసియా దేశాల మధ్య వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

తుర్క్‌మెనిస్తాన్ కొత్త అధ్యక్షుడు బెర్డిముహమెడోవ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల తర్వాత జరిగిన స్వతంత్ర తుర్క్‌మెనిస్తాన్‌కు భారత రాష్ట్రపతి మొదటి సందర్శన కావడం విశేషం. తుర్క్‌మెనిస్థాన్‌లో రాష్ట్రపతి పర్యటనకు ముందు, విదేశాంగ మంత్రిత్వ శాఖ తుర్క్‌మెనిస్తాన్‌తో తన సంబంధాలకు భారతదేశం విలువ ఇస్తుందని పేర్కొంది. బుధవారం, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని సెక్రటరీ (పశ్చిమ) సంజయ్ వర్మ మాట్లాడుతూ, “అధ్యక్షుడి రాష్ట్ర పర్యటన తుర్క్‌మెనిస్తాన్‌తో మన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయి. అంతేకాదు సెంట్రల్ ఆసియా దేశాలతో ఈ భాగస్వామ్యంతో ఉపయోగపడుతుంది.” అని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుంటే, తుర్క్‌మెనిస్తాన్‌లో భారీగా సహజ వాయువు నిల్వలు ఉన్నాయి. “తుర్క్‌మెనిస్తాన్ వ్యూహాత్మకంగా మధ్య ఆసియాలో ఉంది. కనెక్టివిటీ అనేది తుర్క్‌మెనిస్తాన్‌తో భాగస్వామ్యం ప్రయోజనాలను పొందగలదని మేము విశ్వసిస్తున్నాము” అని వర్మ చెప్పారు. మేము తుర్క్‌మెనిస్తాన్‌తో సహా మధ్య ఆసియా దేశాలకు ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని అందించామని ఆయన వెల్లడించారు. Read Also… Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌పై మరోసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా కీలక వ్యాఖ్యలు!