ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది మృత్యువాత
బొలీవియాలోని పోటోసి ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 37 మంది ప్రాణాలు కోల్పోగా, 39 మంది గాయపడ్డారని పోలీసులు, స్థానిక అధికారులు ప్రకటించారు. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉయుని, కొల్చాని మధ్య రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది . బస్సులలో ఒకటి ఎదురుగా ఉన్న లేన్ లోకి దూసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఉయుని అనేది ప్రధాన పర్యాటక ఆకర్షణ ప్రదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఫ్లాట్ అయిన సాలార్ డి ఉయునికి ప్రవేశ ద్వారం

దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ఉన్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. ఈ ఘటన పోటోసి ప్రాంతంలో జరిగింది. ప్రమాదంలో మరో 39 మంది గాయపడ్డారని పోలీసులు, స్థానిక అధికారులు చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ( అంటే మార్చి నెల 1న) ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉయుని – కొల్చాని మధ్య రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సులలో ఒకటి ఎదురుగా ఉన్న లేన్ లోకి దూసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. గాయపడి వారిని సమీపంలోని చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.
ప్రమాదం నుండి బయటపడిన డ్రైవర్లలో ఒకరు ప్రమాదానికి ముందు మద్యం సేవించి ఉన్నాడని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రయాణికులు అతను మద్యం సేవించడాన్ని చూసినట్లుగా చెప్పారు. అక్కడ ఒక పెద్ద కార్నివాల్ వేడుక జరుగుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…




