AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటు అమెరికా .. ఇటు రష్యా.. మధ్యలో నలిపోతున్న ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ

అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్‌తో చర్చలు విఫలం కావడంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారయ్యింది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ నుంచి రక్షణ కల్పిస్తే అమెరికాతో ఖనిజ ఒప్పందంపై సంతకానికి ఇప్పటికి కూడా సిద్దమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

అటు అమెరికా .. ఇటు రష్యా.. మధ్యలో నలిపోతున్న ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ
Zelensky
Balaraju Goud
|

Updated on: Mar 02, 2025 | 10:45 AM

Share

అటు అమెరికా .. ఇటు రష్యా మధ్యలో నలిపోతున్నారు ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ., అమెరికా పర్యటనలో చేదు అనుభవంతో వెనుదిరిగిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ లండన్‌ చేరుకున్నారు. లండన్‌లో ఈయూ సమ్మిట్‌కు జెలెన్‌స్కీ హాజరవుతున్నారు. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో గొడవ కారణంగా కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకాలు చేయకుండానే వెళ్లిపోయారు జెలెన్‌స్కీ.

అయితే లండన్‌ చేరుకున్న తరువాత కాస్త మెత్తబడ్డారు జెలెన్‌స్కీ. అమెరికా తమకు ఎప్పటికి మిత్రదేశమే అన్నారు. పుతిన్‌ నుంచి రక్షణ కల్పిస్తే ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్దమన్నారు. పుతిన్‌ విషయంలో అమెరికా గ్యారంటీ ఇస్తే వెంటనే సంతకం చేస్తామన్నారు. ట్రంప్‌తో తనతో వ్యవహించిన తీరు బాగాలేదన్నారు.

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మ‌ధ్య.. వాషింగ్ట‌న్ డీసీలోని వైట్‌హౌజ్‌లో జ‌రిగిన భేటీ వాగ్వాదానికి దారి తీసింది. కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే.. వైట్‌హౌస్‌ నుంచి వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. ఓవ‌ల్ ఆఫీసులో ట్రంప్‌, జెలెన్‌స్కీ మీడియా ముందే చిర్రుబురులాడుకున్నారు. రూమ్ అంతా నిండిన మీడియా ముందే ఆ ఇద్దరు నేత‌లు మాట‌ల యుద్ధం కొన‌సాగింది. ఉక్రెయిన్‌- రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెస్కీ వ్యవహార శైలి సరికాదని.. జెలెన్‌ స్కీని “స్టుపిడ్‌ ప్రెసిడెంట్‌” అంటూ మండిపడ్డారు. ట్రంప్‌, జెలెన్‌స్కీ వాగ్వాదంతో ఖనిజాల తవ్వకం ఒప్పందం నిలిచిపోయింది.

ట్రంప్‌తో గొడవ తరువాత ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీని హీరోగా చూస్తున్నారు. అగ్రరాజ్యాన్ని ఎదిరించిన మొనగాడిగా కీర్తిస్తున్నారు. అయితే అమెరికా హ్యాండ్ ఇవ్వడంతో తమ దేశ భవితవ్యం ఏమవుతుందన్న ఆందోళన ఉక్రెయిన్‌ ప్రజల్లో నెలకొంది. ట్రంప్‌తో జెలెన్‌స్కీ చర్చలు విఫలమైన తరువాత రష్యా మరింత రెచ్చిపోయింది. ఒకేసారి 200 డ్రోన్లను ప్రయోగించింది. కాకపోతే ఉక్రెయిన్‌కు యూరోపియన్‌ దేశాలతో పాటు కెనడా మద్దతు ప్రకటించడం జెలెన్‌స్కీకి కాస్త ఊరట కలిగించే విషయంగా చెప్పుకోవాలి. జెలెన్‌స్కీకి మద్దతిచ్చే దేశాలు మూడో ప్రపంచ యుద్దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు అర్ధం చేసుకోవాలని రష్యా ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..