Malabar Exercise 2022: జపాన్‌లో ముగిసిన మలబార్‌ మారీటైమ్‌ విన్యాసాలు.. సత్తా చాటిన ఇండియన్ నేవీ..

జపాన్‌లో మలబార్‌ మారీటైమ్‌ విన్యాసాలు ముగిశాయి. ఇండియన్‌ నేవీ తమ సత్తా చాటింది. యెకొసోకు సాగరతీరంలో జరిగిన విన్యాసాల్లో భారత్‌ తరఫున ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌,

Malabar Exercise 2022: జపాన్‌లో ముగిసిన మలబార్‌ మారీటైమ్‌ విన్యాసాలు.. సత్తా చాటిన ఇండియన్ నేవీ..
Malabar Naval Exercise
Follow us

|

Updated on: Nov 17, 2022 | 8:07 AM

జపాన్‌లో మలబార్‌ మారీటైమ్‌ విన్యాసాలు ముగిశాయి. ఇండియన్‌ నేవీ తమ సత్తా చాటింది. యెకొసోకు సాగరతీరంలో జరిగిన విన్యాసాల్లో భారత్‌ తరఫున ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌, ఐఎన్‌ఎస్‌ కమోర్తా నౌకలు చురుగ్గా పాల్గొన్నాయి. ఈ రెండూ స్వదేశీ యుద్ధనౌకలు. ఈ నెల 9న ప్రారంభమైన విన్యాసాలు..వారం రోజుల పాటు జరిగాయి. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నౌకాదళాలు మలబార్‌ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్నాయి. 2020లో రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ చేరడంతో ప్రస్తుతం నాలుగు దేశాల నౌకాదళాలు కలిసి యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి.

జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఈ విన్యాసాలను నిర్వహించింది. భారత్‌ నౌకలకు రియర్‌ అడ్మిరల్‌ సంజయ్‌భల్లా సారథ్యం వహించారు. 1992లో భారత్‌, అమెరికాతో మొదలైన ద్వైపాక్షిక విన్యాసాల్లో..ఆ తర్వాత ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల నౌకాదళాలు భాగస్వామ్యమయ్యాయి. ఈ ఏడాది మలబార్ విన్యాసాల ఉద్దేశం యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ డ్రిల్. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో చైనా సైనిక జోక్యం పెరుగుతోందని ప్రపంచవ్యాప్త ఆందోళనల మధ్య నాలుగు దేశాలు విన్యాసాలు నిర్వహించాయి.

ఇండో–పసిఫిక్‌ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్‌ నేవిగేషన్‌ వ్యవస్థలను పరిరక్షించడంతోపాటు ..ఆ ప్రాంతంలో ఆధిపత్యం కోసం చైనా కుటిల ప్రయత్నాలకు చెక్‌ చెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహించాయి క్వాడ్‌ దేశాలు. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఓపెన్‌ ఫ్రీగా మార్చాలన్నదే మలబార్‌ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని ఆయా దేశాల ప్రతినిధులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..