Kuwait: ఖైదీలకు సామూహిక మరణ శిక్ష.. తుపాకీతో కాల్చారా.. ఉరి తీశారా..
మరణ శిక్ష అనేది చాలా బాధాకరం. వరస హత్యలు, తీవ్ర నేరాలు చేసిన వారికి అప్పుడప్పుడు మరణ శిక్షలు విధిస్తుంటారు. మనదేశంలో ఉరిశిక్ష రూపంలో మరణ శిక్ష విధిస్తుండగా.. విదేశాల్లో వివిధ రూపాల్లో ఈ శిక్షను...

మరణ శిక్ష అనేది చాలా బాధాకరం. వరస హత్యలు, తీవ్ర నేరాలు చేసిన వారికి అప్పుడప్పుడు మరణ శిక్షలు విధిస్తుంటారు. మనదేశంలో ఉరిశిక్ష రూపంలో మరణ శిక్ష విధిస్తుండగా.. విదేశాల్లో వివిధ రూపాల్లో ఈ శిక్షను అమలు చేస్తున్నారు. కొంతమంది వీటిని నిలిపేయాలని చెబుతుంటే మరికొందరు మాత్రం ఇలా చేయడం ద్వారా నేరాలు చేయాలంటేనే భయపడేలా చేయవచ్చని పలవురు అంటున్నారు.అయినప్పటికీ కొన్ని దేశాల ప్రభుత్వాలు వాటి వాటి చట్టాలను అనుసరించి మరణ శిక్షను విధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అత్యంత అరుదుగా సంభవించే సామూహిక మరణ శిక్షలను కువైట్ తాజాగా అమలు చేసింది. హత్యలతోపాటు వివిధ కేసుల్లో దోషులుగా తేలిన ఏడుగురి ఖైదీలకు కువైట్ కేంద్ర కారాగారంలో మరణశిక్ష విధించినట్లు వెల్లడించింది. సామూహిక మరణశిక్ష విధించిన వారిలో ముగ్గురు కువైట్‌కు చెందిన పురుషులు, ఒక కువైట్ మహిళ ఉన్నారు. వీరితోపాటు సిరియా, పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు పురుషులు, ఇథియోపియాకు చెందిన మహిళ ఉన్నట్లు తెలిపింది.
సాధారణంగా ఇండియా మాదిరిగా అక్కడ కూడా ఉరితీసే పద్ధతిని పాటిస్తున్నారు. అంతే కాకుండా మరణశిక్ష పడిన దోషులను సైనికులతో కాల్చి చంపే విధానాన్నీ అమలు చేస్తున్నారు. అయితే.. కువైట్‌లో మరణ దండన అరుదుగానే జరుగుతుందని చెప్పవచ్చు. 2017 నుంచి ఇప్పటివరకు ఆ దేశంలో ఒక్క మరణ శిక్ష కూడా అమలు చేయలేదు. ఆ ఏడాది ఒకేసారి ఏడుగురికి ఈ శిక్షను విధించడం సంచలనంగా మారింది. అంతకు ముందు 2013లో ముగ్గురికి ఈ శిక్ష అమలు చేశారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరానికి గానూ సౌదీ అరేబియా పాకిస్తాన్ పౌరులను ఉరి తీసినట్లు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. గల్ఫ్ దేశంలో 2017 జనవరి 25 న ఒక రాజకుటుంబానికి చెందిన ఒకరితో సహా సుమారు ఏడుగురిని ఒకే రోజు ఉరితీయడం పెద్ద పెద్ద కలకలం రేగింది. ఈ దారుణ ఘటనపై ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ తక్షణమే తాత్కాలికంగా ఉరి శిక్షలను నిలిపివేయాలని కోరింది. ఈ శిక్ష అంతిమ అమానవీయ, అవమానకరమైన శిక్షలుగా పేర్కొంది.



