Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Powassan Virus: మరో ప్రాణాంతక వైరస్‌ విజృంభణ.. యూఎస్‌లో ఒకరి మృతి.. పేల ద్వారా వైరస్ వ్యాప్తి..

ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి పూర్తి విశ్రాంతి అవసరం. రోగులు తమ ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు. తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా శ్వాస తీసుకోవడానికి, హైడ్రేటెడ్‌గా ఉండటానికి లేదా మెదడులో వాపును తగ్గించడానికి ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది.

Powassan Virus: మరో ప్రాణాంతక వైరస్‌ విజృంభణ.. యూఎస్‌లో ఒకరి మృతి.. పేల ద్వారా వైరస్ వ్యాప్తి..
Virus
Follow us
Jyothi Gadda

|

Updated on: May 29, 2023 | 5:18 PM

Powassan Virus: కరోనా వైరస్‌ అనంతరం అనేక కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో కొన్ని వైరస్‌లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కరోనా, మంకీపాక్స్, ఎబోలా ఇలా పలు రకాల వైరస్ లు మానవాళిపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన పొవాసాన్ వైరస్ అనే ప్రాణాంతక వైరస్ కారణంగా యునైటెడ్ స్టేట్స్లో ఒకరు మరణించారు. ఈ ఏడాది అమెరికాలోని మైనేలో పోవాసన్ వ్యాధి మొదటి కేసు నమోదైంది. పోవాసాన్ అంటువ్యాధులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ.. ఇటీవలి సంవత్సరాలలో ముఖ్యంగా యూఎస్, కెనడా, రష్యాలలో సంక్రమణ పెరిగింది. ఈ క్రమంలోనే దీని గురించి ప్రపంచ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2015 నుంచి మైనేలో దాదాపు 15 ఇన్ఫెక్షన్ కేసులు నమోదైన తర్వాత.. గత సంవత్సరం రెండు మరణాలు నమోదయ్యాయి. తాజా మరణంతో మరణాల సంఖ్య మూడుకు చేరింది. ఇక, యూఎస్‌లో ప్రతి సంవత్సరం 25 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారంటూ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ వైరస్‌ గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. వైరస్ లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Powassan ఎలా వ్యాపిస్తుంది?

పొవాసాన్ వైరస్ జింక పేలు, గ్రౌండ్‌హాగ్ పేలు లేదా ఉడుత పేలు వంటివి కాటు వేయటం వల్ల వ్యాధి వ్యాపిస్తుంది. చాలా కేసులు ఈశాన్య, గ్రేట్ లేక్స్ ప్రాంతాల నుండి వసంతకాలం చివరి నుంచి మధ్య శరదృతువు వరకు నమోదవుతున్నట్టుగా తెలిసింది. ఈ సమయంలో పేలు చాలా చురుకుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Powassan వైరస్: లక్షణాలు

జ్వరం, తలనొప్పి, వాంతులు, బలహీనత వంటి లక్షణాలు ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది మెదడు సంక్రమణకు కారణమవుతుంది. మెదడు, వెన్నుపాము (ఎన్సెఫాలిటిస్) లో పేరుకుపోతుంది.

తీవ్రమైన సందర్భాల్లో, రోగులు గందరగోళం, సమన్వయం కోల్పోవడం, మాట్లాడటం కష్టం, మూర్ఛపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

Powassan వైరస్: నిర్ధారణ

ప్రాణాంతక వైరస్ సోకిన వారు వైద్యుడిని సంప్రదించాలి. వారు రోగి సంకేతాలు, లక్షణాల ఆధారంగా రక్తం, వెన్నెముక ద్రవం ల్యాబ్‌ టెస్ట్‌ల ద్వారా వారి పరిస్థితిని నిర్ధారిస్తారు.

Powassan వైరస్: చికిత్స

Powassan వైరస్ సంక్రమణ కేసులకు చికిత్స చేయడానికి నిర్దిష్ట మందులు లేనప్పటికీ, వైద్యులు తరచుగా OTC మందులను సూచిస్తారు.

ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి పూర్తి విశ్రాంతి అవసరం. రోగులు తమ ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు.

తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా శ్వాస తీసుకోవడానికి, హైడ్రేటెడ్‌గా ఉండటానికి లేదా మెదడులో వాపును తగ్గించడానికి ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్  క్లిక్ చేయండి..