AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం మంత్రం వేశావ్‌ తాతా..! ఒక్క హగ్గుతో దొంగను మాయ చేశావ్‌.. బ్యాంక్‌ చోరీలో సినిమాను మించిన ట్విస్ట్‌..

హీరో చిరంజీవి, శ్రీకాంత్‌ కలిసి నటించిన శంకర్‌దాదా MBBS గుర్తుందా? ఇందులో శంకర్‌ దాదా క్యారెక్టర్‌లో చిరంజీవి ఒక్క కౌగిలింత బాధలో ఉన్నవారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, అన్ని టెన్షన్‌ పోయి, మనశ్శాంతిని కలిగించే గొప్ప మార్గంగా అభివర్ణించారు. సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు ఓ 70ఏళ్ల వృద్ధుడు. బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన వ్యక్తిని 'హగ్' చేసి భావోద్వేగానికి గురిచేశాడు.

ఏం మంత్రం వేశావ్‌ తాతా..! ఒక్క హగ్గుతో దొంగను మాయ చేశావ్‌.. బ్యాంక్‌ చోరీలో సినిమాను మించిన  ట్విస్ట్‌..
Bank Robbery
Jyothi Gadda
|

Updated on: May 29, 2023 | 4:47 PM

Share

హీరో చిరంజీవి, శ్రీకాంత్‌ కలిసి నటించిన శంకర్‌దాదా MBBS గుర్తుందా? ఇందులో శంకర్‌ దాదా క్యారెక్టర్‌లో చిరంజీవి ఒక్క కౌగిలింత బాధలో ఉన్నవారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, అన్ని టెన్షన్‌లను వదిలించుకుని మనశ్శాంతికి గొప్ప మార్గంగా అభివర్ణించారు. అవును, ఎవరైనా బాధపడినా, కలత చెందినా, జీవితంలో అలసిపోయినా… అతన్ని గట్టిగా కౌగిలించుకోండి. దాంతో ఆ మనిషి ప్రశాంతంగా ఉంటాడు! ఈ సమయంలో అతను భావోద్వేగానికి గురవుతాడు.. అప్పుడు తనలోని స్ట్రెస్‌ మొత్తాన్ని ఏడుపు ద్వారా వెల్లగక్కుతాడు..మీకు ఇదంతా చిత్రమైన అనుభూతిగా అనిపించినప్పటికీ..అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇలాంటి మ్యాజిక్ హగ్ సంఘటన భారీ  బ్యాంక్ చోరీకి అడ్డుకట్టవేసింది. అసలు విషయం ఏమిటి?

నివేదిక ప్రకారం, మే 22 సోమవారం నాడు 69 ఏళ్ల మైఖేల్ ఆర్మస్ అనే వృద్ధుడు చెక్‌ డిపాజిట్ చేయడానికి ‘బ్యాంక్ ఆఫ్ ది వెస్ట్’ శాఖకు వచ్చారు. క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న బ్యాంకు ఉద్యోగిని తన బ్యాగ్‌లో పేలుడు పదార్థాలు ఉన్నాయని మాస్క్‌లు ధరించిన వ్యక్తి బెదిరించడం చూశాడు. డబ్బులు ఇవ్వకుంటే పేల్చేస్తానంటూ అతడు బెదిరించసాగాడు. ఇది విని బ్యాంకు ఉద్యోగితో సహా బ్యాంకు కస్టమర్లు సైతం భయాందోళనకు గురయ్యారు. కానీ, 69ఏళ్ల మైఖేల్‌ ఆర్మస్‌ మాత్రం.. అతని ప్రాణాలను పట్టించుకోకుండా నిరాయుధుడిగానే దుండగుడితో మాట్లాడటానికి వెళ్ళాడు. బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన వ్యక్తిని ‘హగ్’ చేసి భావోద్వేగానికి గురిచేశాడు. అదేంటని ఆశ్చర్యపోతున్నారు కదా..

అవును, మైఖేల్ ముసుగు ధరించిన వ్యక్తి వద్దకు వెళ్లి, తెలివిగా అతనితో ఏదో మాట్లాడటం ప్రారంభించాడు. మైఖేల్‌ అతనితో మాట్లాడుతూ…ఇలా అడిగారు – విషయం ఏమిటి? నీకు ఉద్యోగం లేదా? దానికి ఆ వ్యక్తి- ఈ నగరంలో నాకు ఏమీ లేదు. నేను జైలుకు వెళ్లాలనుకుంటున్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. మాటల్లో ఉండగానే మైఖేల్ ఆ వ్యక్తిని క్యాష్ కౌంటర్ నుండి డోర్‌కి కొంచెం దూరంగా తీసుకెళ్లాడు. ఈలోగా అతన్ని అప్యాయంగా కౌగిలించుకున్నాడు. దాంతో బ్యాంకును దోచుకునేందుకు వచ్చిన దుండగుడు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బ్యాంకు ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందించారు. వుడ్‌ల్యాండ్ పోలీసులు, ఉన్నతాధికారులు బ్యాంకుకు చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇక్కడ వృద్ధుడి ధైర్యాన్ని ప్రజలు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విచారణలో, వ్యక్తి పేరు ఎడ్వర్డో ప్లాసెన్సియా అని, అతని వయస్సు 42 సంవత్సరాలు అని పోలీసులు గుర్తించారు. తన వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని చెప్పాడు. కేవలం బెదిరించి డబ్బు దోచుకోవాలనుకున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తిపై చోరీకి యత్నించడం, బెదిరించడం, భయానక వాతావరణం సృష్టించడం వంటి నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో, మైఖేల్ ధైర్యాన్ని, అవగాహనను ప్రశంసిస్తూ వుడ్‌ల్యాండ్ పోలీసులు ఫేస్‌బుక్‌లో విషయాన్ని పోస్ట్ చేశారు. దాంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇది తెలిసిన చాలా మంది నెటిజన్లు వృద్ధుడి ధైర్యానికి సెల్యూట్ చేశారు!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!