Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H-1B Visa: అమెరికన్‌ ఉద్యోగులకు H1B ముప్పు

H-1B Visa: అమెరికన్‌ ఉద్యోగులకు H1B ముప్పు

Phani CH

|

Updated on: Jan 21, 2025 | 6:25 PM

అమెరికన్‌ ఉద్యోగులకు హెచ్‌1బి వీసా పెను ముప్పుగా మారిందా ..సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ డిమాండ్‌తో హెచ్‌1బి వీసాల విషయంలో చట్ట సవరణ జరుగుతుందా? శాండర్స్‌ విమర్శలకు కారణమేంటి?.. మంచి వేతనాలను అందుకునే అమెరికన్‌ ఉద్యోగులను తొలగించేందుకే హెచ్‌-1బి ఉపయోగపడుతోందని అమెరికన్‌ సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ ఆరోపించారు.

వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకుంటున్నాయని ఆక్షేపించారు. హెచ్‌-1బి వీసాలకు అవకాశం కల్పిస్తున్న లాకెన్‌ రిలే చట్టాన్ని సవరించాలని కోరుతూ చట్టసభలో ఒక ప్రతిపాదనను శాండర్స్‌ ప్రవేశపెట్టారు. హెచ్‌-1బి వీసాల కోసం కంపెనీలు చెల్లించాల్సిన రుసుములను రెట్టింపు చేయాలన్నారు. దీని ద్వారా లభించే ఆదాయంతో 20వేల మంది అమెరికన్‌ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వవచ్చని తెలిపారు. హెచ్‌-1బి కార్మికులకు కంపెనీలు చెల్లించే వేతనాలను కూడా భారీగా పెంచాలని డిమాండ్‌ చేశారు. తక్కువ వేతనాలకు వచ్చే విదేశీ కార్మికులను నియమించుకోవడం ద్వారా కార్పొరేట్‌ సంస్థలు భారీ మొత్తంలో డబ్బును మిగుల్చుకుంటున్నాయని విమర్శించారు. హెచ్‌-1బి వీసాలను సమర్థిస్తున్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్, భారతీయ అమెరికన్‌ పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామిలపైనా శాండర్స్‌ విమర్శలను సంధించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహా కుంభమేళాలో గోల్డెన్‌ బాబా.. ఒళ్లంతా బంగారమే

నరకం నుంచి విముక్తి.. హమాస్ బందీల భావోద్వేగం..

ఎమర్జెన్సీ సినిమా బ్యాన్.. సిక్కుల తీవ్ర ఆందోళనలు

అవును.. సైఫ్‌పై దాడి చేసింది నేనే.. అంగీకరించిన నిందితుడు

Balakrishna: అదివారం ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం చేయను..