Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహా కుంభమేళాలో గోల్డెన్‌ బాబా.. ఒళ్లంతా బంగారమే

మహా కుంభమేళాలో గోల్డెన్‌ బాబా.. ఒళ్లంతా బంగారమే

Phani CH

|

Updated on: Jan 21, 2025 | 6:24 PM

బాబాలు, సాధువులు, సన్యాసులు అంటే సాదా సీదాగా ఉంటారు.. వారు ఎలాంటి ఆభరణాలు ధరించరు.. ఆడంబరాలకు పోరు... కొందరు ఒంటినిండా విభూధి ధరిస్తే.. కొందరు రుద్రాక్షలు ధరిస్తారు.. మరికొందరు రకరకాల మాలలు ధరిస్తారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరగుతోంది. ఈ కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబాలు, అఘోరాలు, సాధుసన్యాసులంతా తరలి వస్తున్నారు.

కుంభమేళాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఐఐటీ బాబా, కాంటేవాలా బాబా, రుద్రాక్ష్ బాబా.. ఇలా వెరైటీ బాబాలు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పుడు గోల్డెన్‌ బాబా సందడి చేస్తున్నారు. కేరళకు చెందిన ఈ బాబా ఒళ్లంతా బంగారమే.. ఈయన కిలోలకొద్దీ బంగారు ఆభరణాలను ధరించడం ఈయన ప్రత్యేకత. ఈ గోల్డెన్‌ బాబా ఇప్పుడు కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. గోల్డెన్‌ బాబా అసలు పేరు మహా మండలేశ్వర్‌ నారాయణానంద్‌ గిరి మహరాజ్‌. నిరంజనీ అఖాడాకు చెందిన ఈ బాబా కేరళలోని సనాతన ధర్మ ఫౌండేషన్ కు చైర్మన్ గా సేవలందిస్తున్నారు. తన ఒంటిపై ధరించిన బంగారు ఆభరణాల గురించి వివరిస్తూ.. వివిధ దేవతలకు గుర్తుగా ఈ నగలను గత పదిహేనేళ్లుగా ధరిస్తున్నట్లు చెప్పారు. రుద్రాక్షలు, పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగిన ఈ నగల నుంచి తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తెలిపారు. శ్రీ యంత్రంతో పాటు నగలను తాను చేసే పూజల్లోనూ వినియోగిస్తానని చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నరకం నుంచి విముక్తి.. హమాస్ బందీల భావోద్వేగం..

ఎమర్జెన్సీ సినిమా బ్యాన్.. సిక్కుల తీవ్ర ఆందోళనలు

అవును.. సైఫ్‌పై దాడి చేసింది నేనే.. అంగీకరించిన నిందితుడు

Balakrishna: అదివారం ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం చేయను..

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు