నరకం నుంచి విముక్తి.. హమాస్ బందీల భావోద్వేగం..
ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా 90 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ప్రతిగా హమాస్ మిలిటెంట్లు తమ బందీలలో ముగ్గురు మహిళలను రిలీజ్ చేశారు. గాజా స్ట్రిప్ లోని రహస్య ప్రాంతం నుంచి తీసుకొచ్చి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అప్పగించారు.
రెడ్ క్రాస్ వాహనాల్లో బార్డర్ దాటి ఇజ్రాయెల్ లోకి అడుగుపెట్టిన బందీలను సైనికులు వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. దాదాపు పదిహేను నెలల ప్రత్యక్ష నరకం తర్వాత తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆ బందీలు, వారిని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఓవైపు కన్నీరు, మరోవైపు సంతోషంతో కుటుంబ సభ్యులను హత్తుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హమాస్ మిలిటెంట్లు విడుదల చేసిన ముగ్గురు మహిళలు.. రోమి గోనెన్, డోరన్ స్టెయిన్ బ్రీచర్, ఎమిలి డామరి అని ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. కాగా, బందీలకు స్వాగతం పలికేందుకు టెల్ అవీవ్ లోని హోస్టేజ్ స్క్వేర్ వద్ద వేలాదిగా పౌరులు గుమిగూడారు. సైనిక వాహనాల్లో నుంచి ముగ్గురు బందీలు దిగడం చూసి వారంతా సంతోషంతో కేరింతలు కొట్టారు. పలువురు మ్యూజిక్ ప్లే చేస్తూ దేశభక్తి గీతాలు పాడారు. బందీలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ లో పలకరించారు. యావత్ దేశం మిమ్మల్ని ఇంటికి స్వాగతిస్తోందని చెప్పారు. కాగా, ముగ్గురు బందీల విడుదలతో మిగతా బందీల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎమర్జెన్సీ సినిమా బ్యాన్.. సిక్కుల తీవ్ర ఆందోళనలు
అవును.. సైఫ్‌పై దాడి చేసింది నేనే.. అంగీకరించిన నిందితుడు
Balakrishna: అదివారం ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం చేయను..
కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు
TOP 9 ET News: వెంకీతో రూ. 50 కోట్లే కష్టం అన్నారు కానీ కట్ చేస్తే…| బుల్లి రాజుకు కష్టాలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

