Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవును.. సైఫ్‌పై దాడి చేసింది నేనే.. అంగీకరించిన నిందితుడు

అవును.. సైఫ్‌పై దాడి చేసింది నేనే.. అంగీకరించిన నిందితుడు

Phani CH

|

Updated on: Jan 21, 2025 | 5:55 PM

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది తానేనని బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడు అంగీకరించాడు. దుండగుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్‌ను ఆదివారం థానే, కాసరవడవలిలోని హీరానందానీ ఎస్టేట్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్‌పై దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 70 గంటలకుపైగా గాలించి నిందితుడికి అరదండాలు వేశారు.

అనంతరం సీనియర్ పోలీసు అధికారి ఒకరు నిందితుడిని ప్రశ్నిస్తూ.. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఎవరని అడిగారు. అందుకు అతడు ‘హా మైనే హీ కియా హై’ అని బదులిచ్చాడు. లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. అతడి గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాదాపు 100 మంది థానే చేరుకుని గాలింపు మొదలుపెట్టారు. దాదాపు ఏడు గంటలపాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత అటవీ ప్రాంతంలో దాక్కున్న షెహజాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశీయుడైన నిందితుడి వద్ద భారత్‌లో ఉండేందుకు ఎలాంటి పత్రాలు లేవని పోలీసులు తెలిపారు. అతడి వద్ద ఉన్న ఆధారాలను బట్టి అతడు బంగ్లాదేశీయుడని గుర్తించినట్టు అన్నారు. నాలుగు నెలలుగా ముంబైలో ఉంటున్న షెహజాద్ తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకున్నాడు. కాగా, కోర్టు అతడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: అదివారం ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం చేయను..

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు

TOP 9 ET News: వెంకీతో రూ. 50 కోట్లే కష్టం అన్నారు కానీ కట్ చేస్తే…| బుల్లి రాజుకు కష్టాలు

రోగం కాదు.. ఓవర్ యాక్షన్.. పబ్లిసిటీ కోసమే కదా.. ఈ కథలు!

Akhil Akkineni: అయ్యవారి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?

Published on: Jan 21, 2025 05:54 PM