రోగం కాదు.. ఓవర్ యాక్షన్.. పబ్లిసిటీ కోసమే కదా.. ఈ కథలు!
నిన్న మొన్నటి వరకు విశాల్‌కు ఏమైందని అందరూ షాకయ్యారు. వణుకుతూ.. బక్కచిక్కిన అవతారంలో.. ఆయన కనిపించే సరికి బాధపడ్డారు. 'ఎలా ఉండే వాడు ఎలా అయ్యాడు.. విశాల్ నువ్వు త్వరగా కోలువాలి' అని దేవుణ్ణి ప్రార్థించారు. కట్ చేస్తే.. మళ్లీ మునుపటి లుక్‌లో.. ఫుల్ ఎనర్జటిక్‌గా విశాల్ కనిపించాడు. డ్యాన్స్ చేస్తూ.. సెటైరికల్ కామెంట్స్ చేస్తూ.. మీడియా ముందు తిరిగాడు.
కానీ ఈ సారి ఈ హీరోను చూసిన జనాలు మాత్రం సంతోషించడం లేదు. తిడుతున్నారు. దానికితోడు ఓ పాయింట్ పట్టి.. నెట్టింట ఏకిపారేస్తున్నారు. విశాల్ హీరోగా.. సుందర్ సీ డైరెక్షన్లో.. 12 ఏళ్ల క్రితం మదగజరాజా సినిమా చేశాడు. అప్పట్లో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే విశాల్ వణుకుతూ ప్రత్యక్షమయ్యాడు. సోడా బుడ్డి కళ్లద్దాలు.. లూజ్ వైట్ కుర్తాలో దర్శనమిచ్చాడు. అందులోనూ స్టేజ్ పై మెల్లిగా నడుస్తూ.. వణుకుతూ మాట్లాడుతూ.. కనిపించాడు. దీంతో విశాల్ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో ఆరోగ్యం బాలేదేమోనని ఆందోళన చెందారు. విశాల్ ను ఆ రెండు రోజులు నెట్టింట ట్రెండ్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఈ హీరో నటించిన మదగజరాజా సినిమాకు మంచి ప్రమోషన్ లభించినట్టైంది. ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్లింది. ఫైనల్‌గా థియేటర్లు నిండాయి. సినిమా హిట్ అనే టాక్స్ బయటికి వచింది. కట్ చేస్తే.. ఈ ఫిల్మ్ రిజల్ట్ తర్వాత బయటికి వచ్చిన ఈ హీరో.. టీషర్ట్ అండ్ జీన్స్‌లో కనిపించాడు. ఎప్పటిలానే మీడియా ముందు మాట్లాడి మరోసారి అందర్నీ షాకయ్యేలా చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhil Akkineni: అయ్యవారి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?
షూటింగ్ పేరుతో అడవిలో మంటలు.. హీరోకు వార్నింగ్ ఇచ్చిన గ్రామస్థులు
ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. నాలుగు ఆకులు తిన్నారంటే రోగాలన్నీ పరార్