Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లే నిప్పంటిస్తారు..వీళ్లే ఆర్పుతారు.. ఇదేం పైత్యమో..!

వీళ్లే నిప్పంటిస్తారు..వీళ్లే ఆర్పుతారు.. ఇదేం పైత్యమో..!

Phani CH

|

Updated on: Jan 21, 2025 | 3:15 PM

అగ్నిమాపక సిబ్బందిగా పని చేసే వాళ్లెవరైనా సరే.. మంటలు ఆర్పి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు చాలా కష్ట పడతారు. తమ ప్రాణాలకు తెగించి మరీ అమాయక ప్రజల ప్రాణాలు కాపాడుతారు. కానీ ఓ ఇద్దరు సిబ్బంది మాత్రం లాభాల కోసం పలు ఫ్యాక్టరీలకు నిప్పు పెట్టారు. అవి సగం తగలబడి పోయాకా..పరుగున వెళ్లి ఆర్పేస్తున్నారు.

ఈ మధ్యే వీరి అసలు రంగు బయటపడగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ అగ్నిమాపక విభాగంలో ఖాళీలు ఉన్నట్లు తెలుసుకున్న 25 ఏళ్ల విజయ్ శర్మ, 23 ఏళ్ల రాహుల్ యాదవ్‌లు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం సంపాదించి.. సర్నా డూంగర్ ఫైర్ స్టేషన్‌లో తాత్కాలిక ఫైర్‌మెన్‌గా విజయ్ శర్మ, కాంట్రాక్ట్ డ్రైవర్‌గా రాహుల్ యాదవ్ జాయిన్ అయ్యారు. అయితే వీరిద్దరూ కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఉద్యోగం చేస్తుండగా.. అగ్ని ప్రమాదాల సంఖ్యను బట్టి ఎన్ని చోట్ల ఆర్పేస్తే అన్ని వీరికి జీతం లభిస్తుంది. వీరికి ఎక్కువగా డబ్బులు రావడం లేదు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ ఫైర్ ఇంజిన్ల నుంచి పెట్రోల్, డీజిల్ దొంగతనం చేస్తూ సొమ్ము చేసుకున్నారు. ఇది కూడా చాలకపోవడంతో.. ఎక్కువ లాభాలు పొందేందుకు మరో ప్లాన్ వేశారు. ముఖ్యంగా వాళ్లే పలు ఫ్యాక్టరీలకు నిప్పు పెడుతూ అగ్ని ప్రమాదాలను సృష్టిస్తున్నారు. ఆపై అందరి కంటే ముందే వెళ్తూ వాటిని ఆర్పేస్తున్నారు. ఇప్పటికీ విజయ్, రాహుల్ కలిసి నాలుగు ఫ్యాక్టరీలను తగులబెట్టారు. ఆపై అక్కడ చెలిరేగిన మంటలను ఆర్పేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీన స్థితిలో పావలా శ్యామల.. పూరి తనయుడి ఆర్థిక సాయం..

సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా..

చలికాలంలో త్వరగా అలిసిపోతున్నారా? అయితే మీలో ఈ లోపం ఉన్నట్టే!

కోట్లున్న స్టార్ హీరో.. రూపాయి ఆశించకుండా ఆటోవాలా సాయం

సైఫ్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు..